అక్కడ 100 కోట్లు కొల్లగొట్టింది.. ఇక్కడ ప్రచారానికే దిక్కు లేదు!

కంటెంట్ ఉన్నా.. ప్రమోషన్ లేకపోతే అంతే! విధాత: ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగా ఉంటుంది. భారీ స్టార్లు నటించారా లేదా ?బడ్జెట్ సినిమానా భారీగా తెరకెక్కిందా? హీరో హీరోయిన్లు క్రేజ్ ఉన్న వారేనా? దర్శకుడు ఎవరు? ఇవన్నీ పట్టించుకోకుండా కంటెంట్ బాగుంటే ఆ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మరీ కంటెంట్ మీద ఎక్కువగా నమ్మకంతో ప్రమోషన్స్ చేయకపోతే మాత్రం ఆ చిత్రాలు థియేటర్లలో సరైన కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. అవే చిత్రాలు […]

  • Publish Date - February 2, 2023 / 11:11 AM IST

కంటెంట్ ఉన్నా.. ప్రమోషన్ లేకపోతే అంతే!

విధాత: ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగా ఉంటుంది. భారీ స్టార్లు నటించారా లేదా ?బడ్జెట్ సినిమానా భారీగా తెరకెక్కిందా? హీరో హీరోయిన్లు క్రేజ్ ఉన్న వారేనా? దర్శకుడు ఎవరు? ఇవన్నీ పట్టించుకోకుండా కంటెంట్ బాగుంటే ఆ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

అయితే మరీ కంటెంట్ మీద ఎక్కువగా నమ్మకంతో ప్రమోషన్స్ చేయకపోతే మాత్రం ఆ చిత్రాలు థియేటర్లలో సరైన కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. అవే చిత్రాలు ఓటీటీలో విడుదలైనప్పుడు మాత్రం విపరీతమైన ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్నాయి.

ఈమధ్య కన్నడ నుండి వచ్చిన సంచల‌న చిత్రం కాంతారా చిత్రాన్ని గీత ఆర్ట్స్ వారు బాగా ప్రమోట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. కానీ తమిళనాట సంచల విజయం సాధించిన లవ్ టుడే చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేశాడు.

కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఆయన పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దాంతో కోలీవుడ్‌లో సంచల విజయం సాధించిన ఈ చిత్రం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నప్పటికీ మన తెలుగు యువత బ్రహ్మరథం పట్టలేదు. దీనికి పెద్ద మైనస్ ప్రమోషన్స్ లేకుండా సినిమా విడుదల చేయడమే.

తాజాగా మలయాళం సూపర్ హిట్ మాలికాపురం తెలుగులోకి అదే పేరుతో డ‌బ్ అయింది. కేరళ బాక్సాఫీసు వద్ద 100 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా తెలుగులో అదే పేరుతో డ‌బ్ అయింది. ఈ విష‌యం చాలా మంది ప‌ట్టించుకోలేదు. ఈ చిత్రానికి అస‌లు ప్ర‌మోష‌నే జ‌ర‌గ‌లేదు.

ఇక ఈ చిత్రం టైటిల్‌పై కాస్త మొదట విమర్శలు వచ్చాయి. ప్రమోషన్స్ హడావుడి లేదు. కంటెంట్ బాగున్నా కూడా మాలికాపురంను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే కాంతారా చిత్రం లెవెల్‌లో లవ్ టుడే, మాలికాపురం కూడా సంచల విజయాలను నమోదు చేసేవ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు..!