TPCC Chief Mahesh Kumar Goud| రాష్ట్రంలో అద్భుతమైన పాలన : మహేష్ కుమార్ గౌడ్

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతోందని..ఏఐసీసీ మనకు ఇస్తున్న సూచనలు.. లక్ష్యాల మేరకు పని చేస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంగళవారం గాంధీ భవన్ లో టీపీసీసీ పీఏసీ(పొలిటికల్ అడ్వైజరీ కమిటీ) సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం అయింది. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజా నర్సింహ, వంశీ కృష్ణ, సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మంత్రి వర్గం అద్బుతమైన ఆలోచనలతో పథకాలు, కార్యక్రమాలతో ముందుకెలుతున్నారని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన జైబాపు జై భీమ్ సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారని తెలిపారు.
మనం కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని. అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్ని..స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలకు ప్రయత్నించాలని కోరారు. రైతు భరోసా ఒక మంచి కార్యక్రమం ఇది గతంలో ఎన్నడూ లేని విదంగా 9 రోజులలో 9 వేల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీతో సహా కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేసిందని తెలిపారు.