Bihar | క‌ళ్లు పీకేసి.. రొమ్ములు కోసేసి.. ప్రైవేటు భాగాలు చిదిమేసి.. మానవ మృగాల పైశాచికత్వం

Bihar విధాత‌: మానవ మృగాలు ఓ మ‌హిళ‌పై విరుచుకు ప‌డ్డాయి. అతి కిరాత‌కంగా చంపేశారు. ఆమె క‌ళ్ల‌ను పీకేసి, రొమ్ముల‌ను కోసేసి, ప్ర‌యివేటు భాగాల‌ను చిదిమేశారు. అత్యంత క్రూరంగా హింసిస్తూ చంపి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని ఖ‌గ‌రియా జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌గ‌రియా జిల్లాలోని ప‌స్ర‌హా గ్రామానికి చెందిన సులేఖ దేవి వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం త‌న పొలంలోకి వెళ్లింది. పంట పొలంలోనే ఆమెపై కొంత మంది మ‌గాళ్లు […]

  • Publish Date - July 10, 2023 / 10:40 AM IST

Bihar

విధాత‌: మానవ మృగాలు ఓ మ‌హిళ‌పై విరుచుకు ప‌డ్డాయి. అతి కిరాత‌కంగా చంపేశారు. ఆమె క‌ళ్ల‌ను పీకేసి, రొమ్ముల‌ను కోసేసి, ప్ర‌యివేటు భాగాల‌ను చిదిమేశారు. అత్యంత క్రూరంగా హింసిస్తూ చంపి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని ఖ‌గ‌రియా జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌గ‌రియా జిల్లాలోని ప‌స్ర‌హా గ్రామానికి చెందిన సులేఖ దేవి వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం త‌న పొలంలోకి వెళ్లింది. పంట పొలంలోనే ఆమెపై కొంత మంది మ‌గాళ్లు విరుచుకుప‌డ్డారు.

సులేఖ దేవిని చంపే క్ర‌మంలో ఆమెపై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. క‌ళ్ల‌ను పీకేశారు. రొమ్ముల‌ను క‌త్తుల‌తో కోసేశారు. అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌యివేటు భాగాల‌పై క‌త్తుల‌తో పొడిచి పైశాచిక ఆనందం పొందారు. సులేఖ మృతి చెందింది అని నిర్ధారించుకున్న త‌ర్వాత దుండ‌గులు అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు.

సులేఖ దేవి మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఆదివారం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఒక ప‌దునైన ఆయుధాన్ని పోలీసులు సీజ్ చేశారు. అయితే సులేఖ‌ను ఎందుకు చంపారు..? ఎవ‌రు చంపారు..? అన్న విష‌యాలు తేలాల్సి ఉంది.

అయితే సులేఖ భ‌ర్త బబ్లూ సింగ్, ఆమె మ‌రిదిని 2014, ఏప్రిల్ 25వ తేదీన అత్యంత దారుణంగా చంపారు. ఈ జంట హ‌త్య‌ల కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి గ‌తేడాది బెయిల్‌పై జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. భూవివాదాల కార‌ణంగానే నాడు ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని స్థానికులు పేర్కొన్నారు.

ఆ భూ వివాదాలే తాజాగా సులేఖను చంపేందుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సులేఖ‌ను హ‌త్య చేసిన నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ర‌హ‌దారిపై సులేఖ బంధువుల‌, కులస్తులు భారీ స్థాయిలో నిర‌స‌న చేప‌ట్టారు. దీంతో అక్క‌డ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Latest News