Final Destination: చావు ఎలా వస్తుందో.. ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది

విధాత: ఈ భూమిపై జీవం ఉన్న ప్రతి ఒక్కరికీ మరణం ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో వస్తుందనేది యుగాలుగా అంతుబట్టని విషయం. ఏ క్షణమైనా, ఎంతటి వారికైనా కను రెప్ప వేసే సమయం చాలు తుదిశ్వాస విడచడానికి. భవిష్యత్‌లోనూ జవాబు అంటూ లేని అంశం కూడా. సరిగ్గా అలాంటి సందర్భాలను తీసుకుని గతంలో హాలీవుడ్‌లో ఫైనల్ డెస్టినేషన్ ((Final Destination) అంటూ నాలుగైదు సినిమాలు సీక్వెల్స్‌గా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. అంతేకా కాక చూసిన ప్రతి ఒక్కరికీ ఓ రకమైన ఫీల్‌ను కలగజేసి నిత్యం మనసులో తిరిగేలా చేశాయి. అంతేకాదు లైఫ్‌లో ప్రతి చిన్న విషయంలో ఎంత జాగురతతో ఉండాలో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
మిల్లీ సెకన్ సమయంలో మన ప్రమేయం లేకుండానే.. అనుకోకుండా జరిగే పరిణామాలు, ఎక్కడో జరిగే చిన్న పొరపాటు మరెఎక్కడికో దారి తీసి అంతకంతకు పెద్దదై ఘోరం జరగడం, ఆపై క్షణాల్లో ఊహించని రీతిలో ఓళ్లు జలదరింపజేస్తూ మరణం సంభవించడం చకాచకా జరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఓళ్లు గగుర్పొడిపించే సన్నివేశాలతో మూవీ సాగుతూ చూసే వారికి సైతం చమటలు పట్టిస్తుంది. ఇప్పుడు ఆ చిత్రాలకు సీక్వెల్‌గా మరో సినిమా సిద్దమైంది. వార్నర్ బ్రదర్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం మే16న థియేటర్లలోకి రానుంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (Final Destination Bloodlines) అంటూ తెరకెక్కిన కొత్త మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ చూసినా చాలు సినిమా ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది.
కైట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మోన్, ఓవెన్ పాట్రిక్ జోయ్నర్, రియా కిహ్ల్‌స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింజర్ మరియు టోనీ టాడ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించగా ఆడమ్ స్టెయిన్, జాక్ లిపోవ్స్కీ ద్వయం దర్శకత్వం వహించారు. అయితే పూర్తిగా ఐమాక్స్ మోడ్‌లో చిత్రీకరించబడిన ఈ సినిమాను ప్రస్తుతానికి కేవలం ఐమాక్స్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 5 సినిమాలు రాగా చివరి చిత్రం 2011లో వచ్చింది. ఇదిలాఉండగా ఈ సినిమాల గురించి ఇప్పటి తరానికి చాలామందికి అంతగా పరిచయం లేదు. మొబైల్స్ ఫొన్లు విపరీతంగా వాడుకంలోకి వచ్చాక ఇంటర్నెట్ అంతకుమించి అనే రేంజ్‌లో ఉపయోగిస్తున్న ఈ సమయంలో ఈ సినిమా విడుదల కానుండడంతో ఈ ఫైనల్ డెస్టినేషన్ (Final Destination) అనే సినిమా కొంతకాలం సోషల్ మీడియాను షేక్ చేయడం గ్యారంటీ ఆనడంలో ఎలాంటి సందేహం లేదు.