ఢిల్లీ వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం
దేశ రాజధానిలోని ఓ భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని బారాఖంబా రోడ్డులో ఉన్న గోపాల్‌దాస్ భవన్‌లో మంటలు చెలరేగాయి

- 11వ అంతస్థులో చెలరేగిన మంటలు
- ఘటనాస్థలికి చేరిన 11 ఫైరింజన్లు
విధాత: దేశ రాజధానిలోని ఓ భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని బారాఖంబా రోడ్డు ప్రాంతంలో ఉన్న గోపాల్‌దాస్ భవన్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. 15 ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యారు.
11వ అంతస్థు నుంచి దట్టమైన పొగ బయటకు వస్తున్న దృష్ట్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా, ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉన్నది. ఢిల్లీలోని బారాఖంబా రోడ్డు ప్రాంతంలోని గోపాల్‌దాస్ భవనంలో మంటలు చెలరేగినట్టు తమకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిని ఘటనాస్థలానికి పంపించినట్టు ఫైర్ అధికారులు వెల్లడించారు.