Flood Disaster | హిమాచ‌ల్‌లో వ‌ర‌ద బీభ‌త్సం.. కొట్టుకుపోయిన 30 ఇండ్లు, 40 దుకాణాలు

Flood Disaster హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులులో వ‌ర‌ద బీభ‌త్సం నిరాశ్ర‌యుల‌కు ప్ర‌భుత్వం రూ.1 ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం విధాత‌: ఉత్త‌రాదిన భారీ వ‌ర్షాలు జ‌న‌జీవ‌నాన్ని అత‌లాకుతలం చేశాయి. భారీ నష్ట‌ప‌రిహారాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం వ‌ర‌ద‌ల‌కు ఎక్కువ‌గా ఎఫెక్ట్ అయింది. ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో సైంజ్ నది ఉప్పొంగి ప్ర‌వ‌హించింది. వ‌ర‌ద ధాటికి క‌లులోని 40 దుకాణాలు, 30 నివాస గృహాలు కొట్టుకుపోయాయి. అయితే.. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌క‌పోవ‌డంతో అధికార యంత్రాంగం […]

  • Publish Date - July 12, 2023 / 02:40 AM IST

Flood Disaster

  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులులో వ‌ర‌ద బీభ‌త్సం
  • నిరాశ్ర‌యుల‌కు ప్ర‌భుత్వం రూ.1 ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం

విధాత‌: ఉత్త‌రాదిన భారీ వ‌ర్షాలు జ‌న‌జీవ‌నాన్ని అత‌లాకుతలం చేశాయి. భారీ నష్ట‌ప‌రిహారాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం వ‌ర‌ద‌ల‌కు ఎక్కువ‌గా ఎఫెక్ట్ అయింది. ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో సైంజ్ నది ఉప్పొంగి ప్ర‌వ‌హించింది. వ‌ర‌ద ధాటికి క‌లులోని 40 దుకాణాలు, 30 నివాస గృహాలు కొట్టుకుపోయాయి.

అయితే.. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌క‌పోవ‌డంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్న‌ది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో హిమాచ‌ల్ ముఖ్య‌మంత్రి సుఖ్‌విందర్‌సింగ్ ప‌ర్య‌టించారు. నిరాశ్రయులు, వ‌ర‌ద బాధితుల‌కు రూ.1 ల‌క్ష స‌హాయం ప్ర‌క‌టించారు. నిరాశ్ర‌యుల‌కు ఆహార ప‌దార్థాల‌తో, తాత్కాలిక వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు.

కులు జిల్లాలో వ‌ర‌ద ప్ర‌వాహానికి మౌలిక సౌక‌ర్యాలు దెబ్బ‌తిన్నాయి. క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌, విద్యుత్తు వ్య‌వ‌స్థ‌, తాగునీరు, రోడ్డు వ్య‌వ‌స్థ పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. దాంతో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగింద‌ని అధికార యంత్రాంగం తెలిపింది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బుధ‌వారం ప‌ర్య‌టిస్తున్న అధికారులు శాటిలైట్ ఫోన్ల ద్వారా ఉన్న‌తాధికారుల‌కు వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసి వెల్ల‌డిస్తున్నారు