VVS Laxman: శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో.. మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్
విధాత: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని టీమిండియా మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్మెన్ VVS లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించిన స్వామి అమ్మవార్ల అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను కప్పి స్వామి వారి ప్రతిమను MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి […]

విధాత: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని టీమిండియా మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్మెన్ VVS లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించిన స్వామి అమ్మవార్ల అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను కప్పి స్వామి వారి ప్రతిమను MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి బహూకరించారు.
కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు మున్నా రాయల్, జై శ్యామ్ రాయల్, శ్రీవారి సురేష్, విజయ భాస్కర్ రెడ్డి, మని తదితరులు పాల్గొన్నారు.