Sanjay Manjrekar | వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌ ఓడితే విరాట్‌ విలన్‌ అయ్యేవాడు : సంజయ్‌ మంజ్రేకర్‌

Sanjay Manjrekar | టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సగర్వంగా ముద్దాడింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం విఫలమైన విరాట్‌ ఫైనల్‌లో రాణించాడు. ఓపెనర్‌గా వచ్చి 76 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు కూడా దక్కింది. అయితే విరాట్‌ కోహ్లీ ఆ అవార్డుకు అనర్హుడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • By: Thyagi |    sports |    Published on : Jul 02, 2024 8:59 AM IST
Sanjay Manjrekar | వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌ ఓడితే విరాట్‌ విలన్‌ అయ్యేవాడు : సంజయ్‌ మంజ్రేకర్‌

Sanjay Manjrekar : టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సగర్వంగా ముద్దాడింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం విఫలమైన విరాట్‌ ఫైనల్‌లో రాణించాడు. ఓపెనర్‌గా వచ్చి 76 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు కూడా దక్కింది. అయితే విరాట్‌ కోహ్లీ ఆ అవార్డుకు అనర్హుడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టాడు. అసలు ఈ అవార్డుకు విరాట్ అనర్హుడని ఊహించని కామెంట్స్ చేశాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ ఉత్కంఠగా మారిందని విమర్శించాడు. ఒకవేళ ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే విరాట్ విమర్శలు ఎదుర్కొవడమేగాక, విలన్ అయ్యేవాడని వ్యాఖ్యానించాడు. టీ20ల్లో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై అంత స్లో బ్యాటింగ్‌ విజయాన్ని అందించదని ఆయన విమర్శించారు.

‘ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ బాగుంది. కానీ విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్ వల్లే మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ వల్ల హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ హిట్టర్లు తక్కువ బంతులు ఆడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ గనక ఓడిపోయి ఉంటే.. విరాట్ విమర్శలపాలు అవ్వడమే కాకుండా విలన్ గా మారేవాడు. కోహ్లీని బౌలర్లే కాపాడారు. నా అభిప్రాయం ప్రకారం అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుకు అనర్హుడు. ఈ అవార్డు బౌలర్లకు ఇవ్వాల్సింది. ఎందుకంటే మ్యాచ్‌ను వాళ్లే గెలిపించారు’ అని మంజ్రేకర్‌ అన్నాడు.