కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ హ‌ఠాన్మ‌ర‌ణం

Sharad Yadav | కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ యాద‌వ్‌(75) గురువారం రాత్రి క‌న్నుమూశారు. ఇంట్లోనే ఆయ‌న కుప్ప‌కూలిపోవ‌డంతో, కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శ‌ర‌ద్ యాద‌వ్‌ను ప‌రీక్షించిన వైద్యులు, నాడీ కొట్టుకోవ‌డం లేద‌ని, ప్రాణాలు విడిచార‌ని నిర్ధారించారు. శ‌ర‌ద్ యాద‌వ్ మృతితో కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. శ‌ర‌ద్ యాద‌వ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ […]

కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ హ‌ఠాన్మ‌ర‌ణం

Sharad Yadav | కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ యాద‌వ్‌(75) గురువారం రాత్రి క‌న్నుమూశారు. ఇంట్లోనే ఆయ‌న కుప్ప‌కూలిపోవ‌డంతో, కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శ‌ర‌ద్ యాద‌వ్‌ను ప‌రీక్షించిన వైద్యులు, నాడీ కొట్టుకోవ‌డం లేద‌ని, ప్రాణాలు విడిచార‌ని నిర్ధారించారు. శ‌ర‌ద్ యాద‌వ్ మృతితో కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

శ‌ర‌ద్ యాద‌వ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

శ‌ర‌ద్ యాద‌వ్ రాజకీయ జీవితం..

శ‌ర‌ద్ యాద‌వ్ విద్యార్థి నాయ‌కుడిగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. జేపీ మూవ్‌మెంట్‌లో క్రియాశీల‌క పాత్ర పోషించారు. చాలా ఏండ్ల పాటు యాద‌వ్.. ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారు. రాజ్య‌స‌భ‌కు మూడు సార్లు, లోక్‌స‌భ‌కు ఏడు సార్లు ఎన్నిక‌య్యారు. అట‌ల్ బీహారి వాజ్‌పేయి, వీపీ సింగ్ గ‌వర్న‌మెంట్‌లో కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు శ‌ర‌ద్ యాద‌వ్.

2003లో జేడీయూ ఆవిర్భవించిన త‌ర్వాత తొలి జాతీయ అధ్య‌క్షుడిగా శ‌ర‌ద్ ఎన్నిక‌య్యారు. 2016 వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పార్టీ ప‌ద‌వుల నుంచి ఆయ‌న‌ను తొల‌గించారు. 2018లో శ‌ర‌ద్ యాద‌వ్ లోక్‌తాంత్రిక్ జ‌న‌తా ద‌ళ్ పార్టీ స్థాపించారు. 2020 మార్చిలో ఆ పార్టీని రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)లో విలీనం చేశారు.