Tiger cubs | అధికారుల ప్రయత్నాలు విఫలం.. తల్లి దరి చేరని పులి పిల్లలు

విధాత: తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులి పిల్లల (Tiger cubs)ను తిరిగి తల్లి పులి వద్దకు చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అధికారులు తమ ప్రయత్నాలు విరమించుకొని పులి పిల్లలను తిరుపతి జూ పార్కు (Tirupati Zoo Park) తరలించారు. బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతంలో ఎన్ క్లోజర్లో పులి పిల్లలను పెట్టి ఎదురుచూసినప్పటికి తల్లి పులి రాలేదని, మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో అది పిల్లలను […]

Tiger cubs | అధికారుల ప్రయత్నాలు విఫలం.. తల్లి దరి చేరని పులి పిల్లలు

విధాత: తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులి పిల్లల (Tiger cubs)ను తిరిగి తల్లి పులి వద్దకు చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అధికారులు తమ ప్రయత్నాలు విరమించుకొని పులి పిల్లలను తిరుపతి జూ పార్కు (Tirupati Zoo Park) తరలించారు.

బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతంలో ఎన్ క్లోజర్లో పులి పిల్లలను పెట్టి ఎదురుచూసినప్పటికి తల్లి పులి రాలేదని, మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో అది పిల్లలను దగ్గర తీసుకునేందుకు అయిఇష్టత చూపినట్లుగా భావిస్తున్నామని అటవీశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) తెలిపారు. నాలుగు పులి పిల్లలను తిరుపతి జూ పార్కుకు తరలించారు.

డీహైడ్రేషన్‌తో అవి బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. వెటర్నరీ డాక్టర్లు చికిత్స అందిస్తూ వాటి సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నారు. పులి పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని జూ పార్క్ అసిస్టెంట్ కన్జర్వేటర్ నాగరాజు తెలిపారు. పులి పిల్లలను 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. 50 ట్రయల్స్ శిక్షణ పిదప వాటిని తిరిగి అడవిలోకి వదిలి పెట్టాలని భావిస్తున్నామన్నారు.