Mancherial | వైన్ బాటిల్ పేరుతో కోట్ల‌లో మోసం.. ల‌బోదిబోమంటున్న బాధితులు

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో వైన్ బాటిల్ పేరుతో ఒక యాప్ క్రియేట్ అయినది . ఆ యాప్ లో సభ్యులుగా చేరిన వారు తొలుత 425 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలపడంతో చాలామంది అందులో సభ్యత్వం తీసుకున్నారు. ఇదే అదనుగా వైన్ బాటిల్ నిర్వాహకులు ఈ యాప్ లో పెట్టుబడి పెడితే సురక్షితం అతి తక్కువ సమయంలో 3 నెలల్లోపు 5000 పెట్టుబడి పెడితే 15000 వస్తాయని లక్షపెడితే […]

  • Publish Date - June 7, 2023 / 10:20 AM IST

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో వైన్ బాటిల్ పేరుతో ఒక యాప్ క్రియేట్ అయినది . ఆ యాప్ లో సభ్యులుగా చేరిన వారు తొలుత 425 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలపడంతో చాలామంది అందులో సభ్యత్వం తీసుకున్నారు.

ఇదే అదనుగా వైన్ బాటిల్ నిర్వాహకులు ఈ యాప్ లో పెట్టుబడి పెడితే సురక్షితం అతి తక్కువ సమయంలో 3 నెలల్లోపు 5000 పెట్టుబడి పెడితే 15000 వస్తాయని లక్షపెడితే మూడు లక్షలు వస్తాయని ప్రచారం చేయడంతో అది నమ్మిన కొంతమంది డబ్బులు యాప్ లో ఇన్వెస్ట్ చేశారు.

ప్రతిరోజు ఎకౌంట్లో డబ్బులు జమవుతాయని నమ్మబలికి ప్రచారం చేయడంతో సామాన్యులు, సింగరేణి ఎంప్లాయిస్, ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు సైతం అందులో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు సమాచారం . ఒక్కొక్కరు లక్ష నుండి నుండి 35 లక్షల దాకా అందులో ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

అందర్నీ నమ్మించే వరకు కొన్ని రోజుల వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు డైలీ లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బులు వేయడంతో వీరే మౌత్ పబ్లిసిడితో అందరికీ చెప్పడంతో చాలామంది ఆ యాప్ లో జాయిన్ అయి దాదాపు 30 నుండి 50 వేల మంది వైన్ బాటిల్ యాప్ లో ఇన్వెస్ట్ చేశారు.

అయితే.. కోట్లాది రూపాయలు డబ్బులు జమ కాగానే వైన్ బాటిల్ నిర్వాహకులు ఈ యాప్ ను క్లోజ్ చేసి బాధితుల నెత్తిపై శఠగోపం పెట్టడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో వైన్ బాటిల్ యాప్ పై నిర్వాహకులపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.