వామ్మో.. ముక్కులో పొక్కులు గిల్లుకుంటే.. ఇంత డేంజరా?

కొంత­మంది పదే­పదే ముక్కులో వేలిని పెట్టి.. పొక్కులు గిల్లు­కుంటూ ఉంటారు. చెప్పు­కో­వ­డా­నికి అస­హ్యంగా ఉన్నా.. ఎండి­పో­యిన మ్యూక­స్‌ను పెక­ళిస్తూ ఉంటారు

  • Publish Date - February 7, 2024 / 11:32 AM IST
  • ప్రోగ్రె­సివ్‌ డిమె­న్షియా వచ్చే అవ­కాశం ఉందన్న అధ్య­యనం
  • నాశి­కా­రం­థ్రం­లోకి క్రిములు చేరే చాన్స్‌
  • వాటిని ఎదు­ర్కొనే క్రమంలో బీటా అమె­లా­యిడ్‌ విడు­దల చేసే మెదడు
  • అల్జీ­మ­ర్స్‌కు దారి­తీసే డిమె­న్షి­యాకు ఇదే మూల కారణం
  • వెస్ట్రన్‌ సిడ్నీ యూని­వ­ర్సిటీ పరి­శో­ధ­కుల అధ్య­య­నంలో వెల్లడి


సిడ్నీ: కొంత­మంది పదే­పదే ముక్కులో వేలిని పెట్టి.. పొక్కులు గిల్లు­కుంటూ ఉంటారు. చెప్పు­కో­వ­డా­నికి అస­హ్యంగా ఉన్నా.. ఎండి­పో­యిన మ్యూక­స్‌ను పెక­ళిస్తూ ఉంటారు. ఒక్కో­సారి యథా­లా­పంగా ఇది జరి­గి­పోతూ ఉంటుంది. అయితే.. ఇది అత్యంత ప్రమా­ద­క­ర­మైన చర్య అని వెస్ట్రన్‌ సిడ్నీ యూని­వ­ర్సిటీ పరి­శో­ధ­కులు హెచ్చ­రి­స్తు­న్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల క్రిములు ముక్కు­లోకి ప్రవే­శి­స్తా­యని, అది అల్జీ­మ­ర్స్‌కు ప్రారం­భా­నికి అవ­కాశం ఇస్తుం­దని పేర్కొం­టు­న్నారు. ఇప్ప­టికే ప్రచు­రి­త­మైన డజ­న్ల­కొద్దీ పరి­శో­ధన పత్రా­లను సమీ­క్షిస్తూ ఈ అధ్య­యనం వెలు­వ­డింది.


మనం రోజువారీ జీవితంలో మన చేతులతో అనేక వస్తువులను తాకుతుంటాం. అది కారు స్టీరింగ్‌ కావచ్చు.. బైక్‌ హ్యాండిల్‌ కావచ్చు.. పని ప్రదేశాల్లో భారీగా క్రిములు ఉండే కంప్యూటర్‌ కీబోర్డు కావచ్చు.. వీటి ద్వారా మన చేతికి బ్యాక్టీరియా అంటుకుంటాయి. పదే­పదే ఆ వేళ్లను ముక్కులో చొప్పిం­చడం వల్ల కొన్ని రకాల క్రిములు నాశికా రంథ్రం­లోకి ప్రవే­శి­స్తా­యని, దీంతో మెదడు వాటిని ఎదు­ర్కొ­నేం­దుకు బీటా­అ­మె­లా­యిడ్‌ ఉత్పత్తి చేయి­స్తుం­దని అధ్య­య­నంలో వెల్ల­డైంది.


బీటా అమె­లా­యిడ్‌ అనేది అల్జీ­మ­ర్స్‌కు కార­ణ­మయ్యే ప్రోగ్రె­సివ్‌ డిమె­న్షి­యాకు ప్రధాన కార­ణ­మని శాస్త్ర­వే­త్తలు నమ్ము­తు­న్నారు. ఘ్రాణ వ్యవ­స్థ­లోకి ప్రవే­శించే రోగ­కా­ర­కా­లతో పాక్షి­కంగా న్యూరో­ఇ­న్‌­ఫ్ల­మే­షన్‌ (అల్జీ­మర్స్‌ వ్యాధి­కా­రకం) కలిగే ఆస్కారం ఉన్న­దని పరి­శో­ధన నిర్ధ­ర­ణకు వచ్చింది. ఇది మతి­మ­రు­పు­నకు దారి తీస్తుం­దని చెబు­తు­న్నారు. శరీర నిర్మాణ వ్యవ­స్థకు, మెద­డుకు నేరుగా ఉన్న సంబంధం కార­ణంగా.. రోగ­కా­రక అణు­వులు ప్రవే­శిం­చేం­దుకు ఘ్రాణ వ్యవస్థ ఒక మార్గంగా పని­చే­స్తుం­దని అధ్య­యనం పేర్కొం­టు­న్నది.


మయో క్లినిక్‌ అంచనా ప్రకారం.. ఒక్క అమె­రి­కా­లోనే 65 ఏళ్ల వయసు పైబ­డిన సుమారు 65 లక్షల మంది అల్జీ­మర్స్‌ బారిన పడ్డారు. అందులో 70 శాతం మంది 75 ఏళ్ల వయసు పైబ­డి­న­వారే. ప్రపం­చ­వ్యా­ప్తంగా డిమె­న్షి­యాతో బాధ­ప­డు­తున్న 55 లక్షల మందిలో 70 శాతం మంది డిమె­న్షి­యాతో ఉన్న­వారే. తాజా అధ్య­యనం వల్ల వృద్ధా­ప్యంలో మెద­డులో కలిగే మార్పులు, జన్యు­ప­ర­మైన పూర్వ­స్థితి, పర్యా­వ­రణ అంశాలు, జీవ­న­శైలి తది­తర అనేక అంశా­లపై అవ­గా­హ­నకు తోడ్ప­డు­తుం­దని అమె­రికా నేష­నల్‌ ఇన్‌­స్టి­ట్యూట్‌ ఆన్‌ ఏజింగ్‌ పేర్కొ­న్నది.


సాధా­ర­ణంగా ముక్కులో పొక్కు­లను తొల­గిం­చడం వల్ల శ్వాస తీసు­కో­వ­డంలో ఇబ్బం­దిని తొల­గిం­చి­న­ప్ప­టికీ.. అది ఆరో­గ్య­క­ర­మైన పద్ధ­తిలో చేసు­కో­వా­లని, ఎప్ప­టి­క­ప్పుడు ముక్కు చీదే­యడం, నీటితో ముక్కును నిత్యం పరి­శు­భ్రంగా ఉంచు­కో­వడం చేయా­లని శాస్త్ర­వే­త్తలు సూచి­స్తు­న్నారు.


చేతులు ఎంత పరి­శు­భ్రంగా ఉండా­లనే విష­యంలో కొవిడ్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిం­దని వెస్ట్‌ సిడ్నీ పరి­శో­ధ­కుల నివే­దిక గుర్తు చేసింది. ముక్కు విష­యంలో కూడా ఇదే తరహా జాగ్ర­త్తలు తీసు­కో­వా­లని సలహా ఇచ్చింది.