నేటి నుంచి.. 24 గంటల విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి జి.జగదీష్ రెడ్డి
విధాత: 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అవాంతరాలు తొలగిపోయి రాష్ట్రంలో నేటి నుంచి పునరుద్ధరణ చేయబడిందని శాసనసభలో విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. విద్యుత్ సరఫరాలో నెలకొన్న అంతరాయలను చూసి ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా సంబరపడ్డారని అయితే, అయితే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా సరఫరాలో అడ్డంకులు తొలగి నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఎలాంటి సమస్య లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ పునరిద్ధరించబడిందన్నారు. […]

విధాత: 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అవాంతరాలు తొలగిపోయి రాష్ట్రంలో నేటి నుంచి పునరుద్ధరణ చేయబడిందని శాసనసభలో విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ సరఫరాలో నెలకొన్న అంతరాయలను చూసి ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా సంబరపడ్డారని అయితే, అయితే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా సరఫరాలో అడ్డంకులు తొలగి నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఎలాంటి సమస్య లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ పునరిద్ధరించబడిందన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాలో దేశంలోనే ఏ రాష్ట్రం సాధించలేని రీతిలో అద్భుత విజయం సాధించిందన్నారు. దేశంలోనే రాష్ట్ర చరిత్రలో శుక్రవారం రికార్డు స్థాయిలో అత్యధిక విద్యుత్ వినియోగం జరిగిందన్నారు.
ఇవాళ సాయంత్రం 4 గంటలకు 14169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని, గత సంవత్సరం గరిష్ట డిమాండ్ 14166మెగా వాట్లు మాత్రమేనని, రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు ఇదేనని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
గత డిసెంబర్ నెలలో 13403 మెగా వాట్ల విద్యుత్ డిమెండ్ నమోదు కాగా తాజాగా 14169 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని, గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి ఫిబ్రవరి నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి 14169 మెగా వాట్ల విద్యుత్ నమోదు జరిగిందన్నారు.
శాసనసభలో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్లుగా వ్యవసాయానికి శుక్రవారం నుంచి కోతలు లేకుండా 24 గంటల విద్యుత్తు సరఫరా జరిగితే వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ కోతల పట్ల రైతుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉంది. ఈ దిశగా మంత్రి ప్రకటనలో వాస్తవం ఎంత అన్నది మునుముందు తేలిపోనుంది.