Gandrath Sujatha | వేంకటేశ్వర స్వామి మీద ఒట్టు.. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నా: గండ్రత్ సుజాత

Gandrath Sujatha ఎవ్వరికీ అమ్ముడుపోయే వ్యక్తి కాదు ఎమ్మెల్యే జోగు అనుచరుల తప్పుడు ప్రచారం నిరూపించకపోతే చెప్పుతో కొడుతా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నా.. తాను ఎవ్వరికీ అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. ఎన్నికల్లో తనను నేరుగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పారు. అదిలాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర […]

  • Publish Date - September 8, 2023 / 02:35 PM IST

Gandrath Sujatha

  • ఎవ్వరికీ అమ్ముడుపోయే వ్యక్తి కాదు
  • ఎమ్మెల్యే జోగు అనుచరుల తప్పుడు ప్రచారం
  • నిరూపించకపోతే చెప్పుతో కొడుతా
  • టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నా.. తాను ఎవ్వరికీ అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. ఎన్నికల్లో తనను నేరుగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పారు. అదిలాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆమె పార్టీ శ్రేణులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే జోగు రామన్న… కొందరు వ్యక్తులతో కలిసి తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి నని తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేసినారు.. వాటిని రుజువు చేయాలని, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన కుక్కలను చెప్పుతో కొడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో ఓడిన, గెలిచిన ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు. అలాంటి ఓ మహిళను ఎదుర్కోలేక, ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై లేనిపోని నిందలు వేస్తూ, మానసికంగా దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నా, నా ఆస్తులను అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను తప్ప, అమ్ముడుపోయే నా తత్వం కాదని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ అంబకంటి అశోక్, ఎంపీటీసీ సుదర్శన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆరే పోచ్చన్న, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు, ఎస్టీ సెల్ చైర్మన్ ఆనంద్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు వసీం, ఉప సర్పంచ్ మల్లయ్య, కన్య ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, అలలి అశోక్, వెంకట్, సుధీర్ రెడ్డి, రాజేశ్వర్, రసం కిస్తు, నాందేవ్ ష్ణ, ఫైయిమ్ పాల్గొన్నారు.