దేవున్నీ వదలని AP పాలిటిక్స్.. BJP, YCP మధ్య ట్వీట్స్ యుద్ధం!
విధాత: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎటు తిరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. ఓట్ల పందేరంలో ఆఖరుకు దేవుణ్ణి సైతం వదలకుండా ఈ రొంపిలోకి లాగుతున్నారు. దేవుడు.. హిందుత్వమ్ భక్తి ..ఇవన్నీ మాకే సొంతం అనేది బీజేపీ తీరు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని హిందువుల ఓట్లు కొల్లగొట్టడం తమకే పేటెంట్ అనేది వాళ్ళ ఉద్దేశ్యంగా ఉంది. వేరే పార్టీ వాళ్ళు దేవుడిని పూజించినా సహించని స్థితికి చేరుకున్నారు. ఇక శివరాత్రి సందర్భంగా బాలుడి రూపంలో ఉన్న శివునికి ముఖ్యమంత్రి జగన్ […]

విధాత: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎటు తిరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. ఓట్ల పందేరంలో ఆఖరుకు దేవుణ్ణి సైతం వదలకుండా ఈ రొంపిలోకి లాగుతున్నారు. దేవుడు.. హిందుత్వమ్ భక్తి ..ఇవన్నీ మాకే సొంతం అనేది బీజేపీ తీరు.
దేవుణ్ణి అడ్డం పెట్టుకుని హిందువుల ఓట్లు కొల్లగొట్టడం తమకే పేటెంట్ అనేది వాళ్ళ ఉద్దేశ్యంగా ఉంది. వేరే పార్టీ వాళ్ళు దేవుడిని పూజించినా సహించని స్థితికి చేరుకున్నారు. ఇక శివరాత్రి సందర్భంగా బాలుడి రూపంలో ఉన్న శివునికి ముఖ్యమంత్రి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా వైసీపీ ఓ పోష్టర్‌ను ట్విట్టర్లో పెట్టింది. పేదల ఆకలి తీర్చడానికే శివారాధన అంటూ కాప్షన్ పెట్టారు.
దీని మీద బీజేపీ గంగవెర్రులెత్తుతోంది.. ఇది హిందువులను అవమానించడమే. దీనికి జగన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే దీని మీద ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే చర్య అని అంటున్నారు. ఆ ట్వీట్స్ వచ్చిన మరుక్షణం మంత్రులు.. ఎంపీలు వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్ చేస్తూ.. శివరాత్రి వేళ వేసిన ఆ ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించారు ఆకలి గొన్న వారి ఆకలి తీర్చడమే శివారాధన అంటే తప్పు ఎక్కడ నుంచి వచ్చిందని అంటున్నారు. తాము కూడా హిందువులమే అని తమకు ఎక్కడా కనబడని తప్పు వారికి ఎలా కనిపించిదని అంటున్నారు.
కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారి పోవాలా అని ఆయన బీజేపీ నేతల మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా అందుకుంది.. ఇక మతాల మీద.. దేవుళ్ళ మీద బతికేది మీ పార్టీ అంతే గానీ.. మమ్మల్ని తప్పుబట్టడం ఏమిటని అరకు ఎంపీ మాధవి ప్రతి దాడి చేశారు.
ఆ నాడు బాలుని రూపంలో ఉన్న రాముణ్ణి మోడీ గుడిలోకి తీసుకుపోతున్నట్లు వేసిన ఫోటోలు షేర్ చేస్తూ వైసీపీ ప్రతి దాడి చేసింది. అయోధ్యను అద్దం పెట్టుకుని గడుపుతుంది మీరు కాదా అనే ప్రశ్నలు లేవనెత్తారు.. మొత్తానికి ఆదివారం రోజంతా వైసీపీ బీజేపీ సోషల్ మీడియా వర్గాలు.. పార్టీల నాయకులు సైతం ఇలా ట్వీట్ల యుద్ధానికి దిగారు.