మగువలకు తీపికబురు. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 తగ్గి.. తులానికి రూ.58,740కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.64,080కి చేరింది
Gold Rates | మగువలకు తీపికబురు. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 తగ్గి.. తులానికి రూ.58,740కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.64,080కి చేరింది. మరో వెపు వెండి ధర భారీగా తగ్గింది. కిలోకు రూ.100 వరకు తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.59,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,790కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.64,080కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,230కి దిగివచ్చింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.64,080 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. వెండి కిలోకు రూ.100 తగ్గి కిలో రూ.73,500 ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.76,900కి పతనమైంది.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.