Hyderabad
విధాత: అక్రమంగా బంగారాన్ని దేశాలు దాటించేందుకు స్మగ్లర్లు అనేక ఎత్తులు వేస్తున్నారు. నక్క జిత్తులు వాడుతున్నారు. అయినా, కస్టమ్స్ అధికారుల మందు వారి జిత్తులు, పాచికలు పారడం లేదు. తాజాగా శంషాబాద్‌లో సుమారు రూ.13 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్రయాణికుడు గురువారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఆ ప్రయాణికుడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడితోపాటు లగేజీని సైతం క్షుణంగా తనిఖీ చేశారు. తన వెంట తెచ్చిన పాప్‌కార్న్ తయారీ యంత్రాన్ని విప్పి చూడగా 206 గ్రాముల బంగారం లభించింది.
కాగా.. ఆ బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 12.57 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితుడు మిషన్‌లో ఎలా దాడి బంగారం తెచ్చాడో వివరిస్తూ కస్టమ్ అధికారులు విడుదలచేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.