మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద ఎటువంటి మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) వ‌సూలు చేయ‌డం లేద‌ని వివ‌రించింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్ర‌కారం ఏ చార్జీ వ‌సూలు చేయ‌డం లేదని తాజాగా జారీ చేసిన స‌ర్క్యుల‌ర్‌లో వివ‌రించింది. దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ పేమెంట్స్ గేట్‌వేను ప్రోత్స‌హించ‌డానికి ఎన్పీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే […]

  • By: krs    latest    Oct 08, 2022 10:34 AM IST
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద ఎటువంటి మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) వ‌సూలు చేయ‌డం లేద‌ని వివ‌రించింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్ర‌కారం ఏ చార్జీ వ‌సూలు చేయ‌డం లేదని తాజాగా జారీ చేసిన స‌ర్క్యుల‌ర్‌లో వివ‌రించింది.

దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ పేమెంట్స్ గేట్‌వేను ప్రోత్స‌హించ‌డానికి ఎన్పీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ నిర్ణ‌యం రూపే క్రెడిట్ కార్డుతో రూ. 2000 వ‌ర‌కు ట్రాన్సాక్ష‌న్స్ చేసే వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

లిమిట్ రూ. 2 వేలు దాటితే మాత్రం రెగ్యుల‌ర్‌గా ఉన్న‌ట్లే ఛార్జీలు ఉంటాయ‌ని పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌తో క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. త‌ద్వారా క‌స్ట‌మ‌ర్లు, వ్యాపారులు కూడా లాభ‌ప‌డుతార‌ని అంచనా వేసింది.

గ‌త నాలుగేండ్లుగా దేశంలో రూపే క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అన్ని ప్ర‌ధాన బ్యాంకులు రిటైల్‌, క‌మ‌ర్షియ‌ల్ సెగ్మెంట్ల‌లో ఈ క్రెడిట్ కార్డులు జారీచేస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్ లేదా క‌రంట్ అకౌంట్‌తో అనుసంధాన‌మైన డెబిట్ కార్డుల‌తో మాత్ర‌మే యూపీఐ లావాదేవీలు జ‌రిపే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలోనే యూపీఐ లావాదేవీల‌కు క్రెడిట్ కార్డుల‌ను అనుసంధానిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డుల వినియోగం మ‌రింత పెరుగుతుంద‌ని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే ప్ర‌స్తుతానికి రూపే క్రెడిట్ కార్డును ఉప‌యోగించుకునేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. కాగా ఇప్ప‌టికే అన్ని బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు రూపే క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ‌గా జారీ చేయ‌డంపై దృష్టి సారించాయి.