TSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రూ.50కే రోజంతా ప్రయాణం

TSRTC | రూ. 50కే రోజంతా 30కిలోమీటర్ల ప్రయాణం విధాత: ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆ సంస్థ మరో కొత్త బస్ పాస్ ను రేపటి నుండి అందుబాటులోకి తెస్తుంది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం టీ-9(30) బస్ పాస్‌ను ప్రవేశపెట్టింది. 50 రూపాయలకే ఈ బస్ పాస్ తీసుకుని 30 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రయాణించ వచ్చు. మరో 20 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌ప్రెస్ […]

TSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రూ.50కే రోజంతా ప్రయాణం

TSRTC |

  • రూ. 50కే రోజంతా 30కిలోమీటర్ల ప్రయాణం

విధాత: ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆ సంస్థ మరో కొత్త బస్ పాస్ ను రేపటి నుండి అందుబాటులోకి తెస్తుంది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం టీ-9(30) బస్ పాస్‌ను ప్రవేశపెట్టింది.

50 రూపాయలకే ఈ బస్ పాస్ తీసుకుని 30 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రయాణించ వచ్చు. మరో 20 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పాస్ తో ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది.