పంజాబ్‌లోనూ గవర్నర్‌ లొల్లి..

విధాత : రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ వ్యవస్థకు మధ్య జరుగుతున్న పోరాటంలో తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ సరసనే తాజాగా పంజాబ్‌ రాష్ట్రం కూడా చేరింది. కొంత కాలంగా ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు, గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ (Banwarilal Purohi)కు మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొన్నదని అంటున్నారు. ప్రత్యేకించి బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనే గవర్నర్‌లతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఘర్షణ వాతావరణం నెలకొంటుండటం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ నో గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీని ప్రత్యేకంగా […]

  • Publish Date - February 18, 2023 / 01:54 PM IST

విధాత : రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ వ్యవస్థకు మధ్య జరుగుతున్న పోరాటంలో తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ సరసనే తాజాగా పంజాబ్‌ రాష్ట్రం కూడా చేరింది. కొంత కాలంగా ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు, గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ (Banwarilal Purohi)కు మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొన్నదని అంటున్నారు. ప్రత్యేకించి బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనే గవర్నర్‌లతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఘర్షణ వాతావరణం నెలకొంటుండటం గమనార్హం.

అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ నో

గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ప్రతిపాదించారు. అయితే.. అది రాజ్యాంగ విరుద్ధమంటూ గవర్నర్‌ (Punjab governor) పురోహిత్‌ అనుమతి నిరాకరించారు.

ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. అది ఈ నెల 13వ తేదీన ఆప్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతున్నదంటూ గవర్నర్‌ తీవ్ర పదజాలంతో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో వివాదం ముదిరింది.

ఆప్‌ కేంద్ర నాయకత్వానికి దగ్గరి మనుషుల ప్రోద్బలంతో మాన్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంని ఆ లేఖలో ఆరోపించారు. అంటే.. ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), ఆయన మనుషులు ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనేది పరోక్షంగా గవర్నర్‌ అభ్యంతరం. పురోహిత్‌ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు.

ఆ తర్వాత మహారాష్ట్ర బీజేపీ నాయకుడుగా ఉండి.. పంజాబ్‌కు గవర్నర్‌గా వచ్చారు. జరుగుతున్న అవకతవకలపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకునేందుకు రాజ్యాంగ పరంగా తనకు అధికారం ఉందనేది పురోహిత్‌ వాదన. పంజాబ్‌ గవర్నర్‌గా నియమితులు కావడానికి ముందు ఆయన తమిళనాడుకు ఆయన గవర్నర్‌గా పనిచేశారు.

తిప్పి కొడుతున్న మాన్‌ సర్కార్‌

యితే.. ప్రభుత్వ వ్యవహారాల్లో పురోహిత్‌ పదే పదే జోక్యం చేసుకుంటుండటంపై మాన్‌ ప్రభుత్వం గట్టిగానే ప్రతిస్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సలహాలు సూచనలతోనే గవర్నర్‌ రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించింది. తమ ప్రభుత్వానికి ఉన్న ప్రజా మద్దతును దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగానే గవర్నర్‌ వ్యవహారం ఉన్నదని విమర్శించింది. మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

Latest News