విధాత: పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 ఉద్యోగాలకు అనుమతి లభించింది.
డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టుల భర్తీకి, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.