ప్రధాని డిగ్రీ పట్టాల విషయంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తన అనుమానాలను మరింత పెంచిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ చదుకున్నట్లైతే నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకోరని ఆయన సెటైర్ వేశారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీకి డిగ్రీ ఉంటే గుజరాత్ యూనివర్సిటీని ఎందుకు చూపించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడీ డిగ్రీ నకిలీది అయినా అయి ఉండాలి లేదా ఆయనకు భయపడి గుజరాత్ యూనివర్సిటీ సమాచారం ఇవ్వడం లేదా? కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ప్రధాని ఎందుకు చదువుకుని ఉండాలంటే? దేశానికి సంబంధించి ప్రతిరోజూ చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. విజ్ఞానానికి సంబంధించినవి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి. ప్రధానికి చదువు రాకపోతే అధికారులు, ఇతర వ్యక్తులు వచ్చి ఇష్టం వచ్చినట్లు సంతకం తీసుకుంటారు.
ఉదాహరణకు నోట్ల రద్దు వల్ల దేశం చాలా నష్టపోయింది. దేశం పదేళ్లు వెనక్కి వెళ్లింది. జీఎస్టీ నిజానికి చాలా మంచి వ్యవస్థ. కానీ అమలు ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు.