విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో రెండో రోజు పాంచాహ్నిక దీక్షతో స్మార్త ఆగమ శాస్త్ర పద్ధతిలో భేరి పూజ, దేవతాహ్వానం, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం ఘట్టాలను నిర్వహించారు.
నందీశ్వరుడి చిత్రపతాకానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక, వేదపండితులు రామలింగేశ్వరుల కల్యాణానికి ముక్కోటి దేవతలు, సుర, మునులను ఆహ్వానిస్తు ధ్వజారోహణం నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా రేపు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు పర్వత వర్ధిని రామలింగేశ్వరులకళ్యాణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఇంఛార్జ్ ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.