తెలంగాణ ‘పండుగల సాయన్న’.. పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’?

విధాత‌: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాతగా ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. మొగలుల కాలం నాటి పీరియాడికల్ కథతో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రంలో హీరో పాత్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోందని ప్రచారం ఉంది. ఇండియన్ రాబిన్ హుడ్‌గా సాయ‌న్న‌కు పేరుంది. ఈయన జీవిత కథను […]

  • Publish Date - January 25, 2023 / 05:50 AM IST

విధాత‌: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాతగా ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. మొగలుల కాలం నాటి పీరియాడికల్ కథతో ఈ చిత్రం సాగనుంది.

ఈ చిత్రంలో హీరో పాత్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోందని ప్రచారం ఉంది. ఇండియన్ రాబిన్ హుడ్‌గా సాయ‌న్న‌కు పేరుంది. ఈయన జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమా వాయిదాలు పడుతూనే వస్తోంది. కరోనా, రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడం వలన ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూనే వస్తోంది.

ఇక ఈ చిత్ర టీజర్ రిపబ్లిక్‌ డే రోజున విడుద‌ల చేస్తారని ప్రచారం సాగింది. కానీ అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. దాని కారణం కీరవాణి. ప్రస్తుతం ఆయ‌న ఇండియాలో లేరు. ఆస్కార్ కోసం అమెరికాలో RRRను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు టీజర్ రిలీజ్ జరిగే పని తెలుస్తోంది. దీంతో అభిమానులకు మరోసారి నిరాశ తప్పదు.

ఇక ఈ చిత్రంలో ఔరంగజేబుగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఔరంగజేబు సోదరీ రోష నారా పాత్రను న‌ర్గీస్ ఫక్రి పోషిస్తుంది. ఇందులో కథానుసారం వీరమల్లు ఔరంగజేబు సోదరి రోష నారాతో రొమాన్స్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఈ రెండు పాత్రలు చాలా కీలకమైనవి. ఈ రెండు పాత్రల‌తో ముడి పడిన ఎమోషన్ పరాకాష్టలో ఉంటుందని స‌మాచారం. మొత్తానికి ఉద్విగ్న‌తను పెంచేలా ఈ హిస్టరీ ఉంటుంద‌ని పరిశోధకులు అంటున్నారు.