Harshvardhan Rane | ఓ కూతురు ఉన్న బాలీవుడ్ బ్యూటీతో.. రాజమండ్రి హీరో ఎఫైర్! క్రేజంటే ఇది

Harshvardhan Rane | ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లకు ఎపైర్లు, ప్రేమల్లో పీకల్లోతుకు కూరుకుపోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ విషయంగా వాళ్ళ గురించి వచ్చే గాసిప్స్ కూడా సదురు సినీజనాలకు క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా హర్షవర్థన్ రాణే అనే రాజమహేంద్రవరానికి చెందిన టాలీవుడ్ కుర్రాడి గురించి కూడా ఇలాంటి న్యూసే నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజమున్నా అతగాడు ఇవేం పట్టించుకునే రకాన్ని కానని తెగేసి మరీ చెప్పేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. […]

  • Publish Date - July 21, 2023 / 02:42 AM IST

Harshvardhan Rane |

ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లకు ఎపైర్లు, ప్రేమల్లో పీకల్లోతుకు కూరుకుపోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ విషయంగా వాళ్ళ గురించి వచ్చే గాసిప్స్ కూడా సదురు సినీజనాలకు క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా హర్షవర్థన్ రాణే అనే రాజమహేంద్రవరానికి చెందిన టాలీవుడ్ కుర్రాడి గురించి కూడా ఇలాంటి న్యూసే నెట్టింట వైరల్ అవుతుంది.

ఇందులో ఎంత నిజమున్నా అతగాడు ఇవేం పట్టించుకునే రకాన్ని కానని తెగేసి మరీ చెప్పేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. హర్షవర్థన్ తెలుగు తెరకు అంతగా కనెక్ట్ కాకపోయినా బీ టౌన్‌లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. ఇండస్ట్రీ మారే సరికి అబ్బాయి అక్కడి ప్రేక్షకులకే కాదు.. పద్దతులకూ కనెక్ట్ అయ్యాడట.

బీ టౌన్‌లో కొందరు హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ, ప్లే బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కిమ్ శర్మ, మీనాక్షి దాస్ ఇలా మరికొందరితో క్లోజ్‌గా ఉంటూ కొన్నాళ్లపాటు రిలేషన్ మెయింటైన్ చేశాడు. అయితే ఎంత దగ్గరగా ఉంటాడో అంతే త్వరగా బ్రేకప్ చెప్పి ఆ ప్రేమకథకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడట హర్ష. ఇదిలా ఉంటే.. ఈమధ్య ఓ బాలీవుడ్ బ్యూటీ అదీ పెళ్ళయిన హీరోయిన్‌తో హర్ష కాస్త క్లోజ్‌గా ఉంటున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

నటి సంజీదా షేక్‌కి గతంలోనే పెళ్ళయ్యి, ఓపాప కూడా ఉంది. అయితే భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న సంజీదా షేక్ హర్షవర్థన్‌కి కనెక్ట్ అయిందనే న్యూస్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. తాజాగా ఈ వార్తను నిజం చేస్తూ వీళ్ళిద్దరూ వెళ్ళిన వెకేషన్ ఫోటోస్‌లో బ్యాక్ గ్రౌండ్ ఒకటే కావడంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కన్ఫమ్ అయినట్టేననే మాట్లాడుకుంటున్నారు.

అయితే గతంలో ఈ జంట ఓ సినిమాలో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయమే ఇద్దరినీ క్లోజ్ చేసిందట. సంజీదా విషయానికి వస్తే ఈ బ్యూటీ బీ టౌన్‌లో టీవీ ఇండస్ట్రీకి పరిచయమై నెమ్మదిగా సినీ రంగం వైపు వచ్చింది. నటుడు అమీర్ ఆలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే ఏవో కారణాలతో రెండేళ్ళ క్రితం అమీర్, సంజీదా విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సంజీత పాపతో ఒంటరిగా ఉంటుంది.

ఈ ఒంటరితనమే ఇద్దర్ని కలిపిందో ఏమో హర్షవర్థన్, సంజీదా కలిసి తిరుగుతున్నారనేలా మాత్రం వార్తలే వార్తలు. అయితే ఇదే విషయం మీద హర్షమాట్లాడుతూ జర్నలిస్ట్‌లకు రాసుకోవడానికి వారాంతంలో మేటర్ ఉండాలి కదా రాసుకోనీయండి. దీని గురించి నేనేం పట్టించుకోనని తన స్టైల్‌లో రిఫ్లయ్ ఇచ్చాడు. చూడాలి సంజీదాతో ఇతగాడి రిలేషన్ ఎన్నాళ్ళో మరి.