స్కూల్‌పై ఆర్మీ హెలికాప్ట‌ర్ కాల్పులు.. ఆరుగురు చిన్నారులు మృతి

విధాత: మ‌య‌న్మార్‌లో ఆర్మీ దారుణానికి పాల్ప‌డింది. ఓ బౌద్ధ ఆశ్ర‌మానికి సంబంధించి పాఠ‌శాల‌లో రెబ‌ల్ గ్రూపు అయిన కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీతో పాటు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు ఆర్మీకి తెలిసింది. దీంతో ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌ను రంగంలోకి దించి.. స్కూల్‌పై కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ కాల్పుల్లో కొంత‌మంది గ్రామ‌స్థులు కూడా చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. బుల్లెట్ల ధాటికి స్కూల్ బిల్డింగ్‌కు ప‌లు […]

స్కూల్‌పై ఆర్మీ హెలికాప్ట‌ర్ కాల్పులు.. ఆరుగురు చిన్నారులు మృతి

విధాత: మ‌య‌న్మార్‌లో ఆర్మీ దారుణానికి పాల్ప‌డింది. ఓ బౌద్ధ ఆశ్ర‌మానికి సంబంధించి పాఠ‌శాల‌లో రెబ‌ల్ గ్రూపు అయిన కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీతో పాటు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు ఆర్మీకి తెలిసింది. దీంతో ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌ను రంగంలోకి దించి.. స్కూల్‌పై కాల్పులు జ‌రిపింది.

ఈ కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ కాల్పుల్లో కొంత‌మంది గ్రామ‌స్థులు కూడా చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. బుల్లెట్ల ధాటికి స్కూల్ బిల్డింగ్‌కు ప‌లు చోట్ల రంధ్రాలు ప‌డ్డాయి. స్కూల్లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయి.

కాల్పులు జ‌ర‌ప‌డంతో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. గ‌తేడాది మ‌య‌న్మార్‌లో ఆర్మీ స్థానిక ప్ర‌భుత్వాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న విష‌యం తెలిసిందే.