High Court: హమ్మయ్య.. ఊపిరాడుతోంది! 25 వరకూ అవినాష్ అరెస్ట్ వద్దన్న హైకోర్టు

విధాత‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని సైతం ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కడప ఎంపి అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకూ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు వైసిపి క్యాంపుకు ఊరటనిచ్చింది. ఈ ఐదు రోజుల్లో అరెస్ట్ తప్పించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని జగన్ శిబిరం ప్లాన్స్ వేస్తోంది. వాస్తవానికి అవినాష్ రేపు అంటే బుధవారం ఉదయం […]

  • Publish Date - April 18, 2023 / 03:27 PM IST

విధాత‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని సైతం ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కడప ఎంపి అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకూ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు వైసిపి క్యాంపుకు ఊరటనిచ్చింది. ఈ ఐదు రోజుల్లో అరెస్ట్ తప్పించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని జగన్ శిబిరం ప్లాన్స్ వేస్తోంది.

వాస్తవానికి అవినాష్ రేపు అంటే బుధవారం ఉదయం సీబీఐ ఆఫీసుకు విచారణకు వెళ్లాల్సి ఉంది. ఈమేరకు నోటీసులు కూడా పంపారు. విచారణ సమయంలో అరెస్ట్ చేస్తారా అంటూ కోర్టు వేసిన ప్రశ్నకు అవసరం అయితే అరెస్ట్ చేస్తాం అంటూ నిన్న సీబీఐ కోర్టుకు చెప్పిన మాటతో అవినాష్, జగన్ తదితరులకు పెద్ద చిక్కొచ్చిపడింది. దీంతో అవినాష్ వెంటనే హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద కూడా సోమ మంగళవారాల్లో విచారణ జరిగింది.

ఫైనల్ గా ఆయన్ను ఈనెల 25 లోపు అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో అవినాష్ ఊరట చెందారు. ప్రస్తుతానికి అరెస్ట్ భయం తప్పిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 30లోపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో సీబీఐ దర్యాప్తు స్పీడ్ పెంచింది.