సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా
ఈ నెల 28న జరుగాల్సిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిలిచ్చింది

విధాత : ఈ నెల 28న జరుగాల్సిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిలిచ్చింది. డిసెంబర్ 27వ తేదీకి సింగరేణి ఎన్నికలను కోర్టు వాయిదా వేసింది. ఎన్నికల నిర్వాహణకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధంకాగా, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణీ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగరేణి యాజమాన్యం అభ్యర్థన మేరకు ఎన్నికలను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.