High Court | గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ఆపండి: హైకోర్టు

High Court | సోమ‌వారం వర‌కు ఫ‌లితాలు ఇవ్వొద్దు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు హైద‌రాబాద్‌, విధాత: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను సోమ‌వారం వ‌ర‌కు ఇవ్వొద్ద‌ని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ఎన్ ఎస్ యూఐతో పాటు ప‌లువురు అభ్య‌ర్థ‌లు గ్రూప్‌-1 ప‌రీక్ష ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని హైకోర్టులో పిటిష‌న్‌లో దాఖ‌లు చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అభ్య‌ర్థుల నుంచి బ‌యోమెట్రిక్ లేకుండానే ప‌రీక్ష నిర్వ‌హించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై […]

  • Publish Date - July 25, 2023 / 02:56 PM IST

High Court |

  • సోమ‌వారం వర‌కు ఫ‌లితాలు ఇవ్వొద్దు
  • టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

హైద‌రాబాద్‌, విధాత: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను సోమ‌వారం వ‌ర‌కు ఇవ్వొద్ద‌ని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ఎన్ ఎస్ యూఐతో పాటు ప‌లువురు అభ్య‌ర్థ‌లు గ్రూప్‌-1 ప‌రీక్ష ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని హైకోర్టులో పిటిష‌న్‌లో దాఖ‌లు చేశారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అభ్య‌ర్థుల నుంచి బ‌యోమెట్రిక్ లేకుండానే ప‌రీక్ష నిర్వ‌హించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై సోమ‌వారం తెలంగాణ హైకోర్టు విచార‌ణ చేపట్టింది. గ్రూప్‌-1 ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చూస్తుంద‌ని పిటిష‌న‌ర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. త‌దుప‌రి వాద‌న‌లు వినిపించేందుకు సోమ‌వారం వ‌ర‌కు స‌మ‌యం కావాల‌ని అప్పుడు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌లు వినిపిస్తార‌ని ఏజీపీ కోర్టు వారికి తెలిపారు. అయితే సోమ‌వారం వ‌ర‌కు ఫ‌లితాలు ఆపాల‌ని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించ‌డంతో అంగీక‌రించింది.

త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 31కి న్యాయ‌స్థానం వాయిదా వేసింది. ఇదిలా ఉండ‌గా గ్రూప్‌-1 ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారం త‌ర్వాత నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రాష్ట్రంలోని 2.33 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు పాల్గొని ప‌రీక్ష రాశారు.

Latest News