హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

విధాత: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఫలితాలు వెలువడ నున్నాయి. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమాచల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ నెల […]

  • By: krs    latest    Oct 14, 2022 12:02 PM IST
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

విధాత: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఫలితాలు వెలువడ నున్నాయి. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమాచల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ నెల 17 నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. నవంబ‌ర్ 12న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యించింది. నామినేష‌న్ల దాఖ‌లుకు ఈ నెల 25న చివ‌రి తేదీగా నిర్ణ‌యించింది. ఈ నెల 27న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 29 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఒకే విడ‌త‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్న‌హిమాచ‌ల్లో డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.