Hindu Groups Warns Pak lady | 72 గంట‌ల్లో పాకిస్థాన్‌కు వెళ్ల‌కుంటే ఉద్య‌మ‌మే..

Hindu Groups Warns Pak lady సీమా హైదర్‌కు గోరక్ష దళ్‌ హెచ్చరిక విధాత‌: ప్రేమ‌కోసం బార్డ‌ర్ దాటి భార‌త‌దేశంలోకి వచ్చానని చెబుతున్న పాకిస్థాన్ మ‌హిళ‌కు గోర‌క్ష హిందూ ద‌ళ్ 72 గంట‌ల అల్టిమేటం జారీచేసింది. 72 గంట‌ల్లో దేశాన్ని విడిచి వెళ్ల‌క పోతే ఉద్య‌మం చేస్తామని హెచ్చరించింది. ఆమె పాకిస్థానీ గూఢచారి అని గోర‌క్ష హిందూ ద‌ళ్ జాతీయ‌ అధ్య‌క్షుడు వేద్ న‌గ‌ర్ ఓ విడియో విడుద‌ల చేశారు. దేశానికి హాని చేసే వారిని స‌హించ‌బోమ‌ని […]

  • By: krs    latest    Jul 17, 2023 7:47 AM IST
Hindu Groups Warns Pak lady | 72 గంట‌ల్లో పాకిస్థాన్‌కు వెళ్ల‌కుంటే ఉద్య‌మ‌మే..

Hindu Groups Warns Pak lady

  • సీమా హైదర్‌కు గోరక్ష దళ్‌ హెచ్చరిక

విధాత‌: ప్రేమ‌కోసం బార్డ‌ర్ దాటి భార‌త‌దేశంలోకి వచ్చానని చెబుతున్న పాకిస్థాన్ మ‌హిళ‌కు గోర‌క్ష హిందూ ద‌ళ్ 72 గంట‌ల అల్టిమేటం జారీచేసింది. 72 గంట‌ల్లో దేశాన్ని విడిచి వెళ్ల‌క పోతే ఉద్య‌మం చేస్తామని హెచ్చరించింది. ఆమె పాకిస్థానీ గూఢచారి అని గోర‌క్ష హిందూ ద‌ళ్ జాతీయ‌ అధ్య‌క్షుడు వేద్ న‌గ‌ర్ ఓ విడియో విడుద‌ల చేశారు. దేశానికి హాని చేసే వారిని స‌హించ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. వివ‌రాల్లోకి వెళితే.. సీమా గులామ్‌ హైద‌ర్ (30) అనే పాకిస్థానీ మ‌హిళకు 2019లో భార‌త్‌కు చెందిన స‌చిన్ మీనా (25) అనే వ్య‌క్తితో ప‌బ్‌జీ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దీంతో సీమ తన నలుగురు పిల్లలను వెంటబెట్టుకుని నేపాల్ గుండా ఇండియాలోకి ప్ర‌వేశించింది.

ఆ త‌రువాత గ్రేట‌ర్‌ ఇండోర్‌లోని ర‌బూపుర ప్రాతంలో అద్దె అపార్ట్‌మెంట్‌లో స‌హ‌జీవ‌నం ప్రారంభించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్ర‌మంగా దేశంలోకి ప్ర‌వేశించినందుకు సీమ‌ను అలాగే ఆమెకు స‌హాయం చేసిన స‌చిన్‌ను జూలై 4న‌ అరెస్ట్ చేశారు. అనంత‌రం వీరికి బెయిల్ ల‌భించింది. ఈ క్ర‌మంలో మీడియాతో సీమ మాట్లాడుతూ తాను గూఢచారిని కాదని, నిజాలు ముందు ముందు బ‌య‌ట‌ప‌డ‌తాయి అని చెప్పుకొచ్చింది. ఒక వేళ తాను నిజంగానే గూఢచారిని అయిఉంటే ఒంటరిగానే వ‌చ్చేదాన్నని, అమాయ‌కులైన తన పిల్ల‌ల‌ను ఎందుకు తీసుకు వ‌స్తాన‌ని ప్రశ్నించింది.

ఇదిలా ఉండ‌గా సీమా భ‌ర్త అయిన గులామ్ హైద‌ర్ భార‌త ప్ర‌భుత్వానికి హృద‌య‌విదార‌క విన్న‌పం చేసుకున్నాడు. త‌న భార్య‌, పిల్ల‌ల‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాల‌ని వేడుకున్నాడు. ప‌బ్‌జీ ద్వార త‌న భార్యను వ‌ల‌లో వేసుకొని ఇండియాకు వ‌చ్చేలా చేశార‌ని ఓ వీడియోలో మొర‌పెట్టుకున్నాడు. మ‌రో వైపు సీమ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు త‌న‌ను పాక్‌కు పంపాల్సిన ప‌ని లేద‌ని, పిల్ల‌ల‌ను మాత్రం పంపితే స‌రిపోతోంద‌ని అంటున్నారు.