03-04-2023 సోమవారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అనుకోని ఖ‌ర్చులు..!

మేష రాశి : సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. శరీరం స్వస్థత చేకూరుతుంది. ఎవరి సహకారం లేకుండానే పనులు పూర్తవుతాయి. నష్టపోయామనుకున్న ధనము కొంత లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృషభ రాశి : వ్యాపారస్థులకు కొంత వస్తు నష్టము వుండవచ్చును. పై అధికారుల మూలంగా కొంత భ‌యం వుంటుంది. సోమరితనము వలన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. క్రీడాకారులు ఏకాగ్రత చెడకుండా చూసుకోవాలి. వాత సంబంధమైన బాధలుండ‌వ‌చ్చును. మిథున రాశి : వాహన మూలక అశాంతి కలుగవచ్చును. […]

03-04-2023 సోమవారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అనుకోని ఖ‌ర్చులు..!

మేష రాశి : సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. శరీరం స్వస్థత చేకూరుతుంది. ఎవరి సహకారం లేకుండానే పనులు పూర్తవుతాయి. నష్టపోయామనుకున్న ధనము కొంత లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి.

వృషభ రాశి : వ్యాపారస్థులకు కొంత వస్తు నష్టము వుండవచ్చును. పై అధికారుల మూలంగా కొంత భ‌యం వుంటుంది. సోమరితనము వలన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. క్రీడాకారులు ఏకాగ్రత చెడకుండా చూసుకోవాలి. వాత సంబంధమైన బాధలుండ‌వ‌చ్చును.

మిథున రాశి : వాహన మూలక అశాంతి కలుగవచ్చును. ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. పితృ వర్గీయులతో విభేదాలు కలుగవచ్చును. అనుకొన్న ప‌నులు పూర్తి కాకపోడం వలన నిస్పృహ కలుగుతుంది. శరీర బాధలుండవచ్చును.

కర్కాటక రాశి : ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. సరైన దిశలో ఆలోచనలు సాగుతాయి. వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి : ఆరోగ్య సంబంధమైన విషయాలకు ధన వ్యయముంటుంది. వివాదముల మూలకంగా నష్టపోతారు. వాహన మూలక భయముంటుంది. చేయవలసిన పనులేవీ ముందుకు సాగవు. భోజన సౌఖ్యము వుండకపోవచ్చును.

కన్యా రాశి : వైద్యరంగంలోని వారికి అనుకూలమైన రోజు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బహుమానములు లభిస్తాయి. బంధుమిత్రులకు సరైన సలహాలిస్తారు. విఘ్నములు కలిగిననూ కొన్ని పనులు పూర్తి చేస్తారు.

తులా రాశి : విదేశీయాన ప్రయత్నములకు అవరోధం కలుగుతుంది. చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ప్రయాణములతో అలసట ఎక్కువగా వుంటుంది. మీరు చేయాల్సిన పనులకు వేరొకరి సహాయం కోరవలసి వస్తుంది.

వృశ్చిక రాశి : బంధుమిత్రుల‌ ఇళ్ళను సందర్శిస్తారు. కొన్ని పనులను అనుకోని వ్యక్తుల సహకారంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి. రావలసిన డబ్బులు మొండిగా వసులు చేస్తారు. బంగారం కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి : అప్రయత్నముగానే ధన లాభ‌ములుంటాయి. రాజకీయ నాయకులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ప్రయత్నములు ఫలిస్తాయి. శ‌త్రువులతో సంధికి అనుకూలము. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

మ‌క‌ర రాశి : శరీర బాధల వలన ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. అధికారుల మూలకంగా అశాంతి వుండవచ్చను. వ్యాపారస్థులకు వివాదాలు ఎదురౌతాయి. అనుకోని ఖర్చులు వుంటాయి. మనోవ్యాకులము కలుగవచ్చును.

కుంభ రాశి : సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. అజీర్ణము మూలకంగా శరీరం బాధిస్తుంది. కుటుంబసభ్యులకు అపవాదులు కలుగుతాయి. సోదరీ వర్గంతో మాటపట్టింపులు వుంటాయి. శ్రమ వృథా అవుతుంది.

మీన రాశి : జీవితా భాగస్వామి వలన మనోధైర్యం లభిస్తుంది. అధ్యాపక వృత్తిలో వున్నవారికి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దైవిక కార్యక్రమములలో పాల్గొంటారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ధనాదాయము కలుగుతుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.