మేషం : ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.
వృషభం : ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి.
మిథునం : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం : శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు.
సింహం : ఈ రాశివారు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.
కన్య : ఈ రాశివారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
తుల : ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.
వృశ్చికం : ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విసయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు : ఈ రాశివారికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.
మకరం : అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు.
కుంభం : ఈ రాశివారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు.
మీనం : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.