24-02-2023 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి..!

మేషం : క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో బాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తి లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం : పుణ్యక్షేత్ర‌ సందర్శనము సంతృప్తినిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. ప్రముఖులతో కలయికలు వుంటాయి. మిథునం : మోసపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. పట్టుదలతో కార్యములను పూర్తి చేసుకొందురు. నూతన అధికారములు క‌లుగవచ్చును. మొండి బాకీలు వసూలవుతాయి. కర్కాటకం : రాజకీయ నాయకులకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. […]

24-02-2023 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి..!

మేషం : క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో బాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తి లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వృషభం : పుణ్యక్షేత్ర‌ సందర్శనము సంతృప్తినిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. ప్రముఖులతో కలయికలు వుంటాయి.

మిథునం : మోసపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. పట్టుదలతో కార్యములను పూర్తి చేసుకొందురు. నూతన అధికారములు క‌లుగవచ్చును. మొండి బాకీలు వసూలవుతాయి.

కర్కాటకం : రాజకీయ నాయకులకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వర్గముల వారు నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ధనాగమము వుంటుంది.

సింహం : అజీర్ణ సంబంధమైన బాధలు కలుగవచ్చును. దుర్జ‌నులతో సహవాసము చేయకండి. ప్రయత్నకార్యములకు ఆటంకాలు కలుగుతాయి. అధికారుల మూలకంగా అశాంతి కలుగవచ్చును.

కన్య : బంధుమిత్రులతో వివాదములు సమసిపోతాయి. కుటుంబ సభ్యులపై అప‌వాదులు తొలగిపోతాయి. పండితులు నూతన గ్రంధ‌రచనలు చేయుదురు. నష్ట ధనప్రాప్తి కలుగుతుంది.

తుల : వాహన మూలక అశాంతి కలుగవచ్చును. రుణ సంబంధమైన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. సోదరులతో అభిప్రాయభేదాలు రావచ్చును. ధనాగమమునకు ఆటంకాలు కలుగుతాయి.

వృశ్చికం : తల్లిదండ్రులతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. శుభకార్యముల నిర్వహణకై ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనప్రాప్తి కలుగుతుంది.

ధనుస్సు : సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రాంతముల నుండి సమాచారము వస్తుంది, సత్సంగములలో పాల్గొంటారు. స్థిరాస్థి ప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోని విధంగా ధనాగమము వుంటుంది.

మకరం : వృత్తి, ఉద్యోగాలలో, చిక్కులు ఏర్పడవచ్చును. కుటుంబ సభ్యుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. ఇతరులకు నష్టం కలిగించే పనులకు దూరంగా వుండండి. ధనవ్యయము పెరుగుతుంది.

కుంభం : కోపంతో కార్యములను పూర్తి చేసుకుంటారు. మనస్సులోని మాట‌లను ఆలోచనలు బయటికి వ్యక్తమవ‌కుండా జాగ్రత్త పడతారు. కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది. బహుమానములను పొందుతారు.

మీనం : మనః సంకటము ఏర్పడవచ్చును. గతంలో చేసిన పొరపాట్లను గ్రహిస్తారు. నిందావాత్యములను వినవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయండి. వృథా సంచారము కలుగుతుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.