23-03-2023 గురువారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి బంధుమిత్రులతో విభేదాలు..!
మేష రాశి:- ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశముంది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్రేశము వలన పనులు ఆగిపోతాయి. వాక్కాఠిన్యము వలన ఇబ్బంది పడతారు. వృషభ రాశి:- వాక్యాతుర్యముతో పనులను పూర్తి చేసుకుంటారు. పెద్దల ఆదరణ లాభిస్తుంది. మనో ధైర్యముతో శత్రువులను జయిస్తారు. నూతన ఆలోచనలతో వ్యాపారస్థులు రాణిస్తారు. ధనధాన్య లాభములు కలుగుతాయి. మిథున రాశి:- గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్యములను వినవలసి వస్తుంది. ఔషధ సేవనము చేయవలసి వస్తుంది. భోజన సౌఖ్యము వుండకపోవచ్చును. కర్కాటక రాశి:- […]

మేష రాశి:- ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశముంది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్రేశము వలన పనులు ఆగిపోతాయి. వాక్కాఠిన్యము వలన ఇబ్బంది పడతారు.
వృషభ రాశి:- వాక్యాతుర్యముతో పనులను పూర్తి చేసుకుంటారు. పెద్దల ఆదరణ లాభిస్తుంది. మనో ధైర్యముతో శత్రువులను జయిస్తారు. నూతన ఆలోచనలతో వ్యాపారస్థులు రాణిస్తారు. ధనధాన్య లాభములు కలుగుతాయి.
మిథున రాశి:- గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్యములను వినవలసి వస్తుంది. ఔషధ సేవనము చేయవలసి వస్తుంది. భోజన సౌఖ్యము వుండకపోవచ్చును.
కర్కాటక రాశి:- దూర ప్రాంతాల నుండి శుభవార్తలను వింటారు. భూ, గృహలాభములు కలుగుతాయి. శరీర బాధలు ఉపశమిస్తాయి. అధికారుల ఆదర లభిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది.
సింహ రాశి:- సోమరితనం వల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్న కార్యములను మధ్యలోనే వదిలేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఋణమూలక అశాంతి కలుగవచ్చును.
కన్యా రాశి:- నూతన శుభారంభములు చేస్తారు. ఇంట్లో శుభకార్యమూలక సంప్రదింపులు జరుగుతాయి. నూతన వస్తుప్రాప్తి కలుగుతుంది. సర్వత్రా అనుకూలతలు కలుగుతాయి.
తులా రాశి:- ప్రయత్న కార్యములు పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు పనికిరాదు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:- ఋణ బాధలు తీరుతాయి. సాహసముతో పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీర్తి లభిస్తుంది. మిత్రుల సహకారం అందుతుంది. ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది.
ధనస్సు రాశి:- శరీర బాధలతో అశాంతి కలుగుతుంది. సంతాన మూలక సౌఖ్యం లభిస్తుంది. అధికారములలో వృద్ధి వుంటుంది. మిత్రవాత్సల్యము సంతోషాన్నిస్తుంది. అనకొని ధనలాభం కలుగుతుంది.
మకర రాశి:- శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉల్లాసాన్నిస్తుంది. భోజన సౌఖ్యము లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తవుతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది.
కుంభ రాశి:- ఉద్యోగులు మీస్దానాన్ని తిరిగి పొందుతారు. శుభవార్తాశ్రవణము కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాన ధర్మాది పుణ్య కార్యాచరణము కలుగుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది.
మీన రాశి:- వాతసంబంధమైన శరీర బాధలు కలుగవచ్చును. విలువైన వస్తువులను నష్టపోతారు. అపవాదులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. వృథా ధనవ్యయము కలుగుతుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోండి.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.