నగ్న వీడియోలు, ఫోటోలతో భార్యకు బెదిరింపులు..

Hyderabad | విధాత: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఓ మూడు నెలల పాటు దూరంగా ఉన్న ఆ నూతన జంట.. ఇప్పుడు కలిసుంటున్నారు. అయితే ఇద్దరూ కలిసున్న సమయంలో తీసుకున్న వీడియోలను, ఫోటోలను చూపించి.. భార్యను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అడిగినన్ని డబ్బులివ్వకపోతే ఆ నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి.. స్థానికంగా […]

  • Publish Date - October 30, 2022 / 02:18 AM IST

Hyderabad | విధాత: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఓ మూడు నెలల పాటు దూరంగా ఉన్న ఆ నూతన జంట.. ఇప్పుడు కలిసుంటున్నారు. అయితే ఇద్దరూ కలిసున్న సమయంలో తీసుకున్న వీడియోలను, ఫోటోలను చూపించి.. భార్యను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అడిగినన్ని డబ్బులివ్వకపోతే ఆ నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి.. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు నిఖిల్(25) అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇక ఇద్దరు ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో కూడా పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత మూడు నెలల పాటు దూరంగా ఉన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరూ కలిసి ఉంటున్నారు. నిఖిల్ పని చేయకుండా, భార్య కష్టంపై ఆధారపడి బతుకుతున్నాడు. మద్యానికి బానిసైన నిఖిల్.. ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత భార్య రూ. 4 లక్షల వరకు ఇచ్చింది.

ఇంకా డబ్బులు కావాలని, లేని పక్షంలో నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.