Sree Leela విధాత: ఎవరు ఎప్పుడు హిట్‌ని సొంతం చేసుకుంటారో, ఎవరి గ్రాఫ్ ఎప్పుడు పడి పోతుందో సినీ పరిశ్రమలో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇదంతా రెండు సినిమాలకే మోయలేనంత పేరు, ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చేసుకున్న నటిమణి శ్రీలీల గురించే.. ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయినా వచ్చిన క్రేజ్ ఓ పదేళ్లు కష్టపడినా రానంత వచ్చింది. పోనీ ఆ చేసిన రెండు సినిమాలు మహా గొప్పగా ఆడి, కలెక్షన్స్ తెచ్చిపెట్టాయా అంటే […]
Sree Leela
విధాత: ఎవరు ఎప్పుడు హిట్‌ని సొంతం చేసుకుంటారో, ఎవరి గ్రాఫ్ ఎప్పుడు పడి పోతుందో సినీ పరిశ్రమలో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇదంతా రెండు సినిమాలకే మోయలేనంత పేరు, ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చేసుకున్న నటిమణి శ్రీలీల గురించే.. ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయినా వచ్చిన క్రేజ్ ఓ పదేళ్లు కష్టపడినా రానంత వచ్చింది. పోనీ ఆ చేసిన రెండు సినిమాలు మహా గొప్పగా ఆడి, కలెక్షన్స్ తెచ్చిపెట్టాయా అంటే అదీ లేదు. పెళ్లిసందడి యావరేజ్ హిట్టుగా నిలిస్తే, ధమాకా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమాల తర్వాత స్టార్ హీరోయిన్స్‌ని ఓ పక్కకు నెట్టేసి మరీ ఛాన్స్‌లు కొట్టేస్తుందని ఆ మధ్య రాద్దాంతం అయితే, ప్రజెంట్ మంచి ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్‌లు అందిపుచ్చుకుని, దాదాపు పది సినిమాల్లో హీరోయిన్గా చేయబోతుందని టాక్. ఇప్పుడు శ్రీలీల తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు చేయబోతున్న సినిమాల్లో దాదాపు ఓ ఆరు సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేలా టాక్ వైరల్ అవుతుంది.
Pooja Hegde | ఆ హీరోయిన్ దెబ్బకి.. పూజా హెగ్డేకు మెంటలెక్కిపోతోంది
అయితే ఈమధ్య ఓ స్టార్ డైరెక్టర్ బోల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో ఛాన్స్ ఆఫర్ చేస్తూ, దానికి గాను 10 కోట్ల పారితోషికం ఇస్తానని, ఆ సినిమా చేయాలని, కాస్త గట్టిగానే ఒత్తిడి చేసినా.. పది కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా అటువంటి సినిమాలు చేయనని తెగేసి చెప్పేసిందట శ్రీలీల. గతంలో ‘ఆర్ఎక్స్100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ కూడా మంచి సక్సెస్‌నే సొంతం చేసుకుంది కానీ.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమిటనేది తెలియని విషయం కాదు. అదే శ్రీలీల గమనించినట్లుంది.
Sreeleela | ఆ సినిమా శ్రీలీల చేసి ఉంటే.. ఈ పాటికి రష్మిక పెళ్లి అయిపోయేది
‘నేను సినిమాల మీద ఆసక్తితో చేస్తున్నాను. కానీ హద్దులు దాటి నా ఫ్యామిలీ పరువును బజారున పడేయలేను. డబ్బుకు ఆశ పడి అలాంటి సినిమాలు చేయను.. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే.. సినిమాలు మానేసి చదువు మీద దృష్టి పెడతా.. మంచి ఉద్యోగం చేసుకుంటా. అదీ లేదంటే.. నా డాక్టర్ వృత్తిలో స్థిర పడతాను కానీ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను.. అలా చేసి నన్ను నేను దిగజార్చు కోలేను’ అని శ్రీలీల ఆ స్టార్ డైరెక్టర్‌కి చెప్పిందట.
ఈ వార్త బయటికి రావడంతో.. వయసులో చిన్నదే అయినా తన లైఫ్ గురించి తీసుకున్న స్టాండ్ అటు సినీ జనాలకు, ఇటు ప్రేక్షకులకు ముచ్చటేస్తుందని అంటున్నారు. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తే చాలు.. బోల్డ్ క్యారెక్టర్ అయినా చేసే హీరోయిన్ల మధ్య శ్రీలీల ప్రత్యేకంగా కనిపిస్తుందని.. ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయామనే మాట అందరి నోటా వినిపిస్తుంది.
Kajal-Sreeleela Dance | బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్