ఆ బిర్యానీ తింటే శృంగార సామర్థ్యం తగ్గుతుందట..?

విధాత: బిర్యానీ అనగానే నోట్లో లాలాజలం ఊరుతోంది. బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా? అని ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి బిర్యానీ తినడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందట. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ రవీంద్రనాథ్‌ ఘోష్ వెల్లడించారు. సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో ఏ సమయంలో కనిపిస్తుందంటే..? బిర్యానీలో వాడే సుగంధ ద్రవ్యాలు, మాసాల దినుసుల వల్ల పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గుందని ఆయన పేర్కొన్నారు. కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ పరిధిలో అధికంగా బిర్యానీ షాపులు […]

  • By: krs    latest    Oct 25, 2022 6:17 AM IST
ఆ బిర్యానీ తింటే శృంగార సామర్థ్యం తగ్గుతుందట..?

విధాత: బిర్యానీ అనగానే నోట్లో లాలాజలం ఊరుతోంది. బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా? అని ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి బిర్యానీ తినడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందట. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ రవీంద్రనాథ్‌ ఘోష్ వెల్లడించారు.

సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో ఏ సమయంలో కనిపిస్తుందంటే..?

బిర్యానీలో వాడే సుగంధ ద్రవ్యాలు, మాసాల దినుసుల వల్ల పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గుందని ఆయన పేర్కొన్నారు. కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ పరిధిలో అధికంగా బిర్యానీ షాపులు వెలిశాయని, అవన్నీ యూపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందినవని తెలిపారు. ఈ బిర్యానీ షాపుల వల్ల కోల్‌కతా బిర్యానీకి డిమాండ్ తగ్గడంతోనే.. ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు కొందరు పేర్కొంటున్నారు.

శృంగారంతో బీపీకి చెక్‌.. కంటి నిండా నిద్ర‌.. మ‌తిమ‌రుపు మాయం!

ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ.. కుచ్‌బెహార్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారు. కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి షాపులను నిర్వహిస్తున్నారు.

నా మొగుడికి మినిమం ఇవి ఉండాలి.. యువతి పెళ్లి యాడ్ వైరల్

వారు చేసే బిర్యానీలను తినడం వల్ల శృంగార కోరికలు తగ్గుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎలాంటి లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారని, అలాంటి షాపులను మూసి వేయిస్తున్నామని ఘోష్ పేర్కొన్నారు.

మీరు ఆధార్ కార్డు పొంది 10 ఏండ్లు అవుతుందా..? అయితే ఇది తప్ప‌నిసరి..