TSPSC |
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ వచ్చే వారం సోమ లేదా మంగళవారాల్లో తుది కీని విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ యత్నిస్తున్నట్లు సమాచారం. ఫైనల్ కీతో పాటు పరీక్ష రాసిన అభ్యర్థుల హాల్ టికెట్లను కూడా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనుంది టీఎస్‌పీఎస్సీ.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,33,506 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో 121 మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 41 మున్సిపల్ కమీషనర్ – గ్రేడ్ – II, 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ల పోస్టులు ఉన్నాయి.