విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో BJP పిలుపుమేరకు ఆదివారం బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలో బిఆర్ఎస్ నాయకులు ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి తంబాకు పొట్లాల దండవేయగా, ఆగ్రహించిన బిజెపి శ్రేణులు మరుసటి రోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చిత్రపటానికి మద్యం బాటిళ్లు వేసి నిరసన తెలపడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు.
అయితే ముఖ్యమంత్రి చిత్రపటానికి చీఫ్ లిక్కర్లు బాటిళ్ళు వేశారనే అభియోగం మేరకు, బిజెపి నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పోలీసుల తీరును నిరసిస్తూ బిజెపి నాయకులు ఆదివారం ముస్తాబాద్ మండల బంద్ కు పిలుపునిచ్చారు.
బంద్ కారణంగా మండల కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి కోళ్ళ కృష్ణ నాయకులు మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్, సంజీవ్ సంతోష్ రెడ్డి, ఉపేందర్ తో పాటు పలు గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.