VST | నలుగురు పిల్లల ఆకలి తీర్చిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం
VST | విధాత: ఆకలి! కడుపు మాడ్చుతుంది! ఎక్కడ దొరుకుతుందా అని వెతుకులాడుతుంది. ఆకలేస్తే ఉన్నళ్లకైనా లేనోళ్లకైనా ఇది తప్పదు! అలాగే ఈ ఫొటోలో కనిపిస్తున్న నలుగురు చిన్నారులు! అక్కడేదో జరుగుతున్నది.. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశగా వచ్చారు. వందలమంది ఉన్న ఆ చోట.. మొత్తానికి బుడ్డోళ్ల ఆశ నెరవేరింది. ఎవరు పుణ్యం కట్టుకున్నారో.. ఎలాగోలా పోరాడారో.. ఒక అన్నం ప్యాకెట్‌ను దొరకబట్టారు. ఖాళీగా ఉన్న ఒక కుర్చీపై పెట్టుకుని.. నలుగురూ పంచుకుని.. కడుపు నింపుకుని.. హాయిగా […]

VST |
విధాత: ఆకలి! కడుపు మాడ్చుతుంది! ఎక్కడ దొరుకుతుందా అని వెతుకులాడుతుంది. ఆకలేస్తే ఉన్నళ్లకైనా లేనోళ్లకైనా ఇది తప్పదు! అలాగే ఈ ఫొటోలో కనిపిస్తున్న నలుగురు చిన్నారులు! అక్కడేదో జరుగుతున్నది.. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశగా వచ్చారు. వందలమంది ఉన్న ఆ చోట.. మొత్తానికి బుడ్డోళ్ల ఆశ నెరవేరింది. ఎవరు పుణ్యం కట్టుకున్నారో.. ఎలాగోలా పోరాడారో.. ఒక అన్నం ప్యాకెట్‌ను దొరకబట్టారు.
ఖాళీగా ఉన్న ఒక కుర్చీపై పెట్టుకుని.. నలుగురూ పంచుకుని.. కడుపు నింపుకుని.. హాయిగా అడుకునేందుకు వెళ్లిపోయారు. అక్కడ ఉన్న ఒకరు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించారు.
మంత్రి కేటీఆర్ వీఎస్టీ వద్ద స్టీల్ బ్రిడ్జ్‌ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినవారికి అన్నం ప్యాకెట్లు అందించారు. ఏదైతేనేం.. ఒక అభివృద్ధి కార్యక్రమం అనుకోకుండా నలుగురు చిన్నారుల ఆకలి తీర్చింది