Group 1 | గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రూప్-1పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • By: Somu    latest    Feb 06, 2024 10:33 AM IST
Group 1 | గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంపు

Group 1 | విధాత : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రూప్-1పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ విచారణ ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ప్రభుత్వం తాజాగా గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను మరో 60పెంచిన నేపథ్యంలో పెంచిన పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారా లేక గతం జారీ చేసిన నోటిఫికేషన్‌లోనే కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సివుంది.