Independence Celebrations | స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ కర్తలు వీరే
Independence Celebrations 32జిల్లాలకు బాధ్యుల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విధాత: దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 అధికారిక వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి, గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించేందుకు 32జిల్లాల వారిగా మంత్రులకు, శాసన సభ, మండలి స్పీకర్లకు, విప్‌లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, […]
Independence Celebrations
- 32జిల్లాలకు బాధ్యుల నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
విధాత: దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 అధికారిక వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి, గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించేందుకు 32జిల్లాల వారిగా మంత్రులకు, శాసన సభ, మండలి స్పీకర్లకు, విప్‌లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జయశంకర్ భూపాల పల్లిలో ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జోగులాంబ గద్వాల్‌లో డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు, కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, కొమురంభీం అసిఫాబాద్‌లో మండలి విప్ సుంకరి రాజు, మహబూబ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతకావిష్కరణ చేయనున్నారు.
మహబూబబాద్‌లో మంతి సత్యవతి రాథోడ్, మంచిర్యాలలో విప్ బాల్క సుమన్, మెదక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి, ములుగులో విప్ ప్రభాకర్‌రావు, నాగార్ కర్నూల్‌లో విప్ గువ్వల బాలరాజు, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నారాయణపేటలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి, నిర్మల్‌లో మంత్రి ఎ.ఇంధ్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లిలో మండలిలో
చీప్ విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు జాతీయ పతకావిష్కరణ చేయనున్నారు.
సిరిసిల్లలో మంత్రి కెటీఆర్, రంగారెడ్డిలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ, సిద్ధిపేటలో మంత్రి టి.హరీశ్‌రావు, సూర్యాపేటలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, వికారాబాద్‌లో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హన్మకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్‌లోమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, యాదాద్రి భువనగిరిలో విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు జాతీయ పతకావిష్కరణ చేసి ప్రసంగించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram