కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా ప్ర‌క‌ట‌న‌.. మా అంత‌ర్గ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్దన్న భార‌త్‌

మ‌ద్యం పాల‌సీ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విష‌యంలో అమెరికా స్పందించింది. ఈమేర‌కు యూఎస్ రాయ‌బార కార్య‌ల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది

  • By: Somu    latest    Mar 27, 2024 12:45 PM IST
కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా ప్ర‌క‌ట‌న‌.. మా అంత‌ర్గ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్దన్న భార‌త్‌

న్యూ ఢిల్లీ: మ‌ద్యం పాల‌సీ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విష‌యంలో అమెరికా స్పందించింది. ఈమేర‌కు యూఎస్ రాయ‌బార కార్య‌ల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగా విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది. అమెరికా ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. భార‌త్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం వెంట‌నే మానుకోవాల‌ని కోరింది. మా దేశ అంత‌ర్గ‌త విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం ఏమాత్రం స‌మంజ‌సం కాద‌ని పేర్కొన్న‌ది.


భార‌త‌దేశం పెద్ద ప్ర‌జాస్వామిక దేశ‌మని ఇక్క‌డ ఎంత పెద్ద స‌మ‌స్య‌నైనా చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌ప‌రంగా ప‌రిష్క‌రించుకుంటామ‌ని ఇలాంటి విష‌యాల్లో ఇత‌ర దేశాలు జోక్యం చేసుకొని స‌మ‌యం వృధా చేసుకోరాద‌ని వెల్ల‌డించింది. భార‌త్‌లో స్వ‌తంత్ర న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జాస్వామ్యం ఆధార‌ప‌డి ఉంద‌ని, అక్క‌డ ఎంతటి స‌మ‌స్య‌నైనా నిష్ప‌క్ష‌పాతంగా స‌మాన‌త్వంతో ప‌రిష్కారం చేస్తార‌ని, వాటిపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం, ప్ర‌శ్నించ‌డం పూర్తిగా అవివేకమ‌ని బ‌దులిచ్చింది. ఇంత‌కు ముందు కూడా కేజ్రీవాల్ అరెస్టు పై జ‌ర్మ‌నీ కూడా ఇలాగే స్పందించింది. దానిపై కూడా భార‌త్ త‌న వ్య‌తిరేక‌త‌ను, అసంతృప్తిని తెలియ‌జేసింది.