అండర్ 19 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్

న్యూజిలాండ్ జట్టుపై 8 వికెట్లతో విజయం అర్ధ‌సెంచరీ సాధించిన శ్వేతా శెరావత్ సమష్టిగా రాణించిన బౌలర్లు.. 3 వికెట్లు పడగొట్టిన చోప్రా విధాత: తొలిసారిగా జరుగుతున్న మహిళల అండర్ 19 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు 8 వికెట్ల తేడాతో అలవోకగా విజయం అందుకుంది. కివీస్ విధించిన 107 పరుగుల విజయలక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే ఛేదించిన అమ్మాయిల జట్టు భారీ విజయంతో ఫైనల్ […]

  • Publish Date - January 27, 2023 / 02:15 PM IST
  • న్యూజిలాండ్ జట్టుపై 8 వికెట్లతో విజయం
  • అర్ధ‌సెంచరీ సాధించిన శ్వేతా శెరావత్
  • సమష్టిగా రాణించిన బౌలర్లు.. 3 వికెట్లు పడగొట్టిన చోప్రా

విధాత: తొలిసారిగా జరుగుతున్న మహిళల అండర్ 19 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు 8 వికెట్ల తేడాతో అలవోకగా విజయం అందుకుంది.

కివీస్ విధించిన 107 పరుగుల విజయలక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే ఛేదించిన అమ్మాయిల జట్టు భారీ విజయంతో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బ్యాటింగ్ 10 పరుగులకే కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ ఔటై వెనుదిరిగినా.. మరో ఓపెనర్ శ్వేతా శరావత్ 61 పరుగులు, సౌమ్య తివారి 22 పరుగులు చేసి విజయంలో కీలపాత్ర పోషించారు.

తెలంగాణ బ్యాటర్ గొంగడి త్రిష 5 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ఆటాడించారు. భారత బౌలర్లలో పర్శవి చోప్రా 3 వికెట్లతో అద్భుతంగా రాణించగా సాధు, మన్నత్ కశ్యప్, షఫాలి వర్మ, అర్చనా దేవి తలో వికెట్ పడగొట్టారు.

కివీస్ బ్యాటర్లలో జార్జియా ప్లిమ్మర్ (35), ఇసబెల్లా గాజే 26 రన్స్ చేసి ఫరవాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు భారత బౌలింగ్ ను ఆడడంలో ఫెయిల్ కావడంతో కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేసింది.

సంక్షిప్త స్కోరు : ( న్యూజిలాండ్ :107/9 (20.0 ఓవర్లు, జార్జియా సిమ్మర్ 35, ఇసబెల్లా 26)
(భారత్ : 110/2(14.2 ఓవర్లు, శరావత్ 61, చోప్రా 3 వికెట్లు)