‘India’ | ఎందుకు అంత వ్యతిరేకత?

'India' మేం గీసిన ముగ్గులో మీరు దిగారు ‘ఇండియా’పై మోదీ విమర్శలకు టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రైన్‌ కౌంటర్‌ భారత్‌ విజయం సాధిస్తుందని వ్యాఖ్య న్యూఢిల్లీ: 26 ప్రతిపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయంలో ప్రధాని ఎందుకు అంత వ్యతిరేక భావనలో ఉన్నారని టీఎంసీ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లో ఒక సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. మరోసారి ఇండియా కూటమి పేరును ప్రస్తావించారు. […]

‘India’  | ఎందుకు అంత వ్యతిరేకత?

‘India’

  • మేం గీసిన ముగ్గులో మీరు దిగారు
  • ‘ఇండియా’పై మోదీ విమర్శలకు
  • టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రైన్‌ కౌంటర్‌
  • భారత్‌ విజయం సాధిస్తుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: 26 ప్రతిపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయంలో ప్రధాని ఎందుకు అంత వ్యతిరేక భావనలో ఉన్నారని టీఎంసీ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లో ఒక సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. మరోసారి ఇండియా కూటమి పేరును ప్రస్తావించారు.

ఈస్టిండియా కంపెనీలోనూ, స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)లోనూ ‘ఇండియా’ పదం ఉన్నదన్న మోదీ.. దేశం పేరును వాడినంత మాత్రాన ప్రజలు మోసపోబోరని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డెరెక్‌ ఓ బ్రైన్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

‘హలో పీఎం నరేంద్రమోదీ.. మళ్లీ అదే మాట. మా కొత్త పేరు ఇండియాపై దాడి. జీతేగా భారత్‌. ఏమైంది మీకు? ఎందుకంత వ్యతిరేక భావనతో ఉన్నారు? మేం ఏదైతే కోరుకున్నామో.. మీరు అక్కడికే వచ్చారు. స్పందించండి. వ్యతిరేకతతోనే ఉండండి. మేం మా ‘ఇండియా’ అనే పదాన్ని మరింత విస్తృతంగా తీసుకొనిపోతాం. భారత్‌ విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నారు.

భారతదేశ విదేశీ సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పార్లమెంటులో ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనా డెరెక్‌ ఓ బ్రైన్‌ మండిపడ్డారు. ప్రధానమంత్రికి మణిపూర్ ప్రజల బాధల కంటే పర్యటనలే ముఖ్యమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.