H3N2 Influenza | H3N2 వైరస్ విజృంభణ.. హర్యానా, కర్ణాటకలో ఇద్దరు మృతి..!
H3N2 Influenza | దేశ వ్యాప్తంగా కరోనా వైరస్( Coronavirus )లు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో వైరస్ విజృంభిస్తోంది. హెచ్3ఎన్2( H3N2 Influenza ) వైరస్ విజృంభిస్తుండంతో దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా హెచ్3ఎన్2 వైరస్ బారిన పడి హర్యానా, కర్ణాటకలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే […]

H3N2 Influenza | దేశ వ్యాప్తంగా కరోనా వైరస్( Coronavirus )లు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో వైరస్ విజృంభిస్తోంది. హెచ్3ఎన్2( H3N2 Influenza ) వైరస్ విజృంభిస్తుండంతో దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా హెచ్3ఎన్2 వైరస్ బారిన పడి హర్యానా, కర్ణాటకలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
H3N2 వైరస్ లక్షణాలు ఇవే..
హెచ్3ఎన్2 ఇన్ప్లూయెంజా ఒక వైరస్ ఉపరకం. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, సైనస్, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడుతాయి. అయితే ఈ వైరస్ బారిన పడిన వారిలో దగ్గు అంత త్వరగా తగ్గదు. దగ్గు తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల సమయం తప్పక పడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.
ఐసీఎంఆర్( ICMR ) వివరాల ప్రకారం.. హెచ్3ఎన్2 సోకి హాస్పిటల్స్లో చేరిన వారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కన్పించాయి.