తొలిరోజు టీమ్ ఇండియా సూపర్ హిట్.. కంగారూల ప్లాప్ షో!
AUSVSIND బంతితో గింగరాలు తిప్పారు.. బ్యాటుతో నిలబడ్డారు.. మేజిక్ చేసిన సర్ జడేజా.. అశ్విన్.. తొలి ఇన్నింగ్స్ లో 177 రన్స్ కే ఆసీస్ ఆలౌట్ హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 77/1 వామప్ మ్యాచ్ లాడం అన్నారు.. బెంగళూరులో భారత స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా నియమించుకుని ఫుల్ గా ప్రాక్టీస్ చేశారు. నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. మాటల యుద్ధంతో హీట్ పుట్టించనంత సునాయాసంగా.. ప్రాక్టీస్ లో స్పిన్నర్లను […]

AUSVSIND
- బంతితో గింగరాలు తిప్పారు.. బ్యాటుతో నిలబడ్డారు..
- మేజిక్ చేసిన సర్ జడేజా.. అశ్విన్..
- తొలి ఇన్నింగ్స్ లో 177 రన్స్ కే ఆసీస్ ఆలౌట్
- హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్..
- తొలి రోజు ఆటముగిసే సమయానికి 77/1
వామప్ మ్యాచ్ లాడం అన్నారు.. బెంగళూరులో భారత స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా నియమించుకుని ఫుల్ గా ప్రాక్టీస్ చేశారు. నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. మాటల యుద్ధంతో హీట్ పుట్టించనంత సునాయాసంగా.. ప్రాక్టీస్ లో స్పిన్నర్లను ఎదుర్కొన్నంత మాత్రానా.. రియల్ గ్రౌండ్‌లో సత్తా చాటలేరని ఆసీస్ కు తొలిటెస్టు తొలిరోజే అర్థమైంది.
నాగపూర్ పిచ్ లో కేవలం టర్న్ మాత్రమే ఉంది. ప్రమాదకరమైన బౌన్స్ లేదు.. ఒక బాల్ వికట్ల పైకి వెళ్లడం లేదంటే బాగా లో అవడం ఏమాత్రం కనిపించలేదు. ఎంత ప్రాక్టీస్ చేసినా ..మైదానంలో సర్ జడేజా మెలికలు తిప్పుతున్న బంతులకు దాసోహమన్నారు. అశ్విన్ వేసిన మెరుపు బంతులకు వికెట్లు సమర్పించుకున్నారు.. ఈ సారి మేం బాగా సిద్ధమై వచ్చాం.. మా బ్యాటింగ్ సత్తా ఏంటో భారత స్పిన్నర్లకు చూపిస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన ఆసీస్ బ్యాట్స్ మెన్ చతికిలబడ్డారు.
సూపర్ ఫాంలో ఉన్న ఓపెనర్లు ఖవాజా, వార్నర్ పేస్ దెబ్బకు ఔట్ కాగా.. మిగిలిన వారిని జడేజా, అశ్విన్ పెవిలియన్ కు పంపారు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే బాధ తప్పుతుంది. తద్వారా భారత బ్యాట్స్ మెన్ ను రెండో ఇన్నింగ్స్ లో తిప్పలు పెట్టవచ్చు. ఇలాగే ఆసీస్ జట్టు టాస్ గెలవడం జరిగింది. కానీ తొలిరోజు టీ విరామానికి కాసేపటికే 177 పరుగులకే ఆలౌట్ కావడంతో టాస్ గెలిచిన ఆనందం ఆవిరైంది.. (విధాత ప్రత్యేకం)
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలిరోజే సిరీస్ ఫలితంపై ఆసీస్ అంచనాలను ప్రశ్నించేలా చేసింది. ఎంతగా ప్రాక్టీస్ చేసినా.. మైదానంలో ఎంతగా నిలబడాలని చూసినా.. భారత స్పిన్నర్ల బంతి దాడులను నుంచి కంగారూలు నిలబడలేకపోయారు. నాలుగు టెస్టుల సిరీస్ భారత అభిమానుల అంచనాలకు తగ్గట్లే స్టార్టైంది.
ఎంత మంచి ఫామ్‌తో వచ్చినా.. భారత పర్యటనలో అంత ఈజీ కాదని ఆస్ట్రేలియాకు మరోసారి అర్థమైంది. మోకాలి గాయం సర్జరీ తర్వాత కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా (5/47)కు తోడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (3/42) కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ జట్టులో మార్నస్ లబుషేన్ (49; 123 బంతుల్లో 8×4) టాప్‌స్కోరర్.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆట క్లోజింగ్ సమయానికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. దూకుడుగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ (69 బంతుల్లో 9×4, 1×6: 56 బ్యాటింగ్) తోడుగా అశ్విన్ (0) క్రీజులో ఉన్నాడు. 9 వికెట్లు చేతిలో ఉన్న భారత్ ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది. మరో ఓపెనర్ రాహుల్ (20)ను ఆట ఆఖర్లో ఆసీస్ తరఫున డెబుడంట్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఔట్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా కు కెప్టెన్ రోహిత్ మెరుపు స్టార్ట్ ఇచ్చాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే త్రీ బౌండరీలు కొట్టి ఉద్దేశాన్ని చాటాడు. ఒకవైపు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ బ్యాటర్లు తడబడిన పిచ్ పైనే అలకవోకగా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కమిన్స్ తోపాటు ఆసీస్ ప్రధాన స్పిన్నర్ లైయన్ పై ఎదురుదాడి చేసి బౌండరీలు బాదాడు. మరోవైపు రాహుల్ మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేస్తూ కుదురుకునేలా కనిపించినా మర్ఫీ వేసిన అనూహ్యమైన బంతికి ఔటయ్యాడు.
జడేజా అదుర్స్.. పేసర్లు షైన్..
తొలిటెస్టు తొలిరోజు ఆటలో జడేజా నే సూపర్ హీరో. ఆరునెలలు ఆటకు దూరమైనా అతని బౌలింగ్ లో ఎలాంటి తడబాటు కనిపించలేదు. ఎన్ సీఏలో వందల కొలది బంతులేసి చేసిన ప్రాక్టీస్.. రంజీ మ్యాచ్ తో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. ముఖ్యంగా తనమీద తనకున్న నమ్మకం అతన్ని సక్సెస్ చేసింది. తొలుత భారత స్పిన్నర్లు లెగ్ స్టంప్ ఆవల నుంచి బంతులేస్తూ వికెట్లు రాబట్టడానికి ప్రయత్నించారు. దీంతో స్పిన్ బాగా ఆడగల లబుషేన్ , స్మిత్ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించారు.
UNPLAYABLE delivery by Ravindra Jadeja to get rid of Steve Smith