Jammu and Kashmir | క‌శ్మీర్‌లో చొర‌బాటుకు య‌త్నం.. అడ్డుకున్న భార‌త సైన్యం

విధాత‌: జ‌మ్మూ క‌శ్మీర్‌ (Jammu and Kashmir) లోని ఉరీ సెక్టార్‌లో చొరబాటుదారుల ఎత్తును భార‌త సైన్యం చిత్తు చేసింది. శ‌నివారం తెల్ల‌వారుజామున అటువైపు నుంచి చొర‌బాటు య‌త్నం జ‌ర‌గ‌గా.. సైనికులు గుర్తించి కాల్పులు జ‌రిపారు. దాంతో అటువైపు నుంచీ కాల్పులు మొద‌ల‌య్యాయి. కాసేపు ఆ ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం అంతా కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లింది. అదే స‌మయంలో చొర‌బాటుదారులు క్వాడ్‌ కాప్ట‌ర్ (నాలుగు రోట‌ర్‌లు ఉన్న డ్రోన్‌) ను ప్ర‌యోగించ‌గా.. సైనికులు దానిపై బుల్లెట్‌ల వ‌ర్షం కురిపించారు. […]

  • Publish Date - May 13, 2023 / 07:43 AM IST

విధాత‌: జ‌మ్మూ క‌శ్మీర్‌ (Jammu and Kashmir) లోని ఉరీ సెక్టార్‌లో చొరబాటుదారుల ఎత్తును భార‌త సైన్యం చిత్తు చేసింది. శ‌నివారం తెల్ల‌వారుజామున అటువైపు నుంచి చొర‌బాటు య‌త్నం జ‌ర‌గ‌గా.. సైనికులు గుర్తించి కాల్పులు జ‌రిపారు. దాంతో అటువైపు నుంచీ కాల్పులు మొద‌ల‌య్యాయి. కాసేపు ఆ ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం అంతా కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లింది.

అదే స‌మయంలో చొర‌బాటుదారులు క్వాడ్‌ కాప్ట‌ర్ (నాలుగు రోట‌ర్‌లు ఉన్న డ్రోన్‌) ను ప్ర‌యోగించ‌గా.. సైనికులు దానిపై బుల్లెట్‌ల వ‌ర్షం కురిపించారు. దాంతో డ్రోన్‌ను వారు పాక్ భూభాగంలోకి మ‌ళ్లించారు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం అండ‌దండ‌లున్నాయ‌ని చెప్పేందుకు క్వాడ్‌కాప్ట‌రే సాక్ష్య‌మ‌ని సైన్యం చెబుతోంది.