Shadnagar: IPL క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రూ.1,12,950 నగదు స్వాధీనం ఆన్‌లైన్ నెట్ క్యాష్… రూ.23,010 శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల దాడులు విధాత‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటి సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ ఆటకు సంబంధించి స్థానిక యువత ముఠాగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా రూ. […]

  • Publish Date - April 8, 2023 / 12:38 AM IST
  • రూ.1,12,950 నగదు స్వాధీనం
  • ఆన్‌లైన్ నెట్ క్యాష్… రూ.23,010
  • శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల దాడులు

విధాత‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటి సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ ఆటకు సంబంధించి స్థానిక యువత ముఠాగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా రూ. 1 లక్షా 12 వేల 950 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ నెట్ క్యాష్.. రూ.23,010 కూడా గుర్తించినట్టు ఎస్ఓటి సిఐ సత్యనారాయణ మీడియాకు తెలిపారు.

షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సురేష్ ఈ బెట్టింగ్ నిర్వాహకుడిగా పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఫరూక్ నగర్ కు చెందిన పూల వ్యాపారం చేసుకునే షబ్బీర్, అయ్యప్ప కాలనీకి చెందిన సంపంగి యాదగిరి, ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఎనుముల గణేష్, ఇదే కాలనికి చెందిన మచ్చ జంగయ్య, ఎనుముల రమేష్, ఎనుముల కిషోర్ మొత్తం 7 మంది యువకులను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు.

వీరంతా పరిగి రోడ్డు లోని హనుమాన్ దేవాలయం పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు ఎస్ఓటి పోలీసులు తెలిపారు. వీరి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువత బెట్టింగులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సదరు ముఠా సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినట్లు తెలిపారు.